![]() |
![]() |

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) కి కేరళలో ఎందరో అభిమానులున్నారు. ఆయన నటించిన పలు సినిమాలు అక్కడ మంచి వసూళ్లను రాబట్టాయి. తనపై అంతటి ప్రేమ చూపిస్తున్న కేరళ ప్రజలకు కష్ట సమయంలో అండగా నిలిచి.. తన మంచి మనసుని చాటుకున్నారు అల్లు అర్జున్.
కేరళ వాయినాడ్ బాధితుల సహాయార్థం అల్లు అర్జున్ రూ.25 లక్షల విరాళం ప్రకటించారు. "వాయనాడ్‌లో ఇటీవల జరిగిన కొండచరియలు విరిగిపడటం పట్ల నేను చాలా బాధపడ్డాను. కేరళ ఎల్లప్పుడూ నాకు చాలా ప్రేమను ఇస్తోంది. పునరావాస పనులకు మద్దతుగా కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.25 లక్షలు విరాళంగా ఇవ్వడం ద్వారా నా వంతు కృషి చేయాలనుకుంటున్నాను. మీ భద్రత మరియు బలం కోసం దేవుడిని ప్రార్థిస్తున్నాను." అన్నారు అల్లు అర్జున్.
![]() |
![]() |