![]() |
![]() |

సాయం చేయడంలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఎప్పుడు ముందుంటారు. తాజాగా ఆయన మరోసారి తన గొప్ప మనసుని చాటుకున్నారు. కేరళ వరద బాధితుల సహాయార్థం భారీ విరాళం భారీ విరాళం ప్రకటించారు.
"గత కొన్ని రోజులుగా ప్రకృతి ప్రకోపానికి కేరళలో జరిగిన విధ్వంసం మరియు వందలాది విలువైన ప్రాణాలను కోల్పోయినందుకు తీవ్ర మనోవేదనకు గురయ్యాను. వయనాడ్ దుర్ఘటన మనసుని కలిచివేసింది. కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రామ్ చరణ్, నేను కలిసి రూ.1 కోటి విరాళంగా అందజేస్తున్నాం. బాధలో ఉన్న వారందరూ కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను." అంటూ సోషల్ మీడియా వేదికగా తెలిపారు చిరంజీవి.

కాగా, అల్లు అర్జున్, మోహన్ లాల్, కమల్ హాసన్, సూర్య, రష్మిక మందన్న, నయనతార ఇలా పలువురు సినీ నటీనటులు కేరళ బాధితులకు విరాళం ప్రకటించారు.
![]() |
![]() |