![]() |
![]() |

చిరు తనయుడు నుంచి మెగా పవర్ స్టార్ గా, మెగా పవర్ స్టార్ నుంచి యూనివర్సల్ స్టార్ గా ట్రాన్స్ ఫామ్ అయ్యి లక్షలాదిమంది అభిమానులని సంపాదించుకున్న హీరో రామ్ చరణ్(ram charan)2012 లో ఉపాసన కామినేని తో వివాహం అయ్యింది. 2023 లో తండ్రిగా ప్రమోషన్ అందుకున్నాడు.దీంతో చరణ్ అభిమానుల ఆనందం అంతా ఇంతా కాదు. లేటెస్ట్ గా చరణ్ గురించి ఆయన సోదరి నీహారిక చెప్పిన కొన్ని విషయాలు వాళ్ళ ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది.
నీహారిక(niharika)తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతు ఇప్పటి వరకు నేను చూసిన బెస్ట్ ఫాథర్స్ లో చరణ్ అన్న కూడా ఒకడు.నిజం చెప్పాలంటే వరల్డ్ లోనే బెస్ట్ ఫాదర్.ఇందులో ఎలాంటి అతిశయోక్తి లేదు.చరణ్ అన్నయ్యే క్లీంకార(klin kaara)కి అన్నం తినిపిస్తాడు. ఆ సమయంలో క్లీంకార చాలా చాలా అల్లరి చేస్తుంది. కానీ ఎంతో ఓపిగ్గా కుక్క పిల్లలని, పక్షులని చూపిస్తు అన్నం తినిపిస్తాడు. అదే విధంగా షూటింగ్స్ లో ఎంత బిజీగా ఉన్నా కూడా క్లీంకార తో ఎక్కువ సమయం గడుపుతాడు. ఈ విషయంలోనే ఒక్కోసారి అన్నయ్యని చూస్తే సినిమాలు లేకుండా క్లీంకార తో గడుపుతున్నాడా అనిపిస్తుంది.వర్క్ లైఫ్ ని పర్సనల్ లైఫ్ ని చాలా చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటాడు. క్లీంకార మా గోల్డెన్ డార్లింగ్ అని చెప్పుకొచ్చింది.
.webp)
ఇక ఇప్పుడు ఈ మాటలు మెగా ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ ని తీసుకొస్తున్నాయి. అదే విధంగా ఎప్పుడెప్పుడు క్లీంకార పేస్ చూస్తామా అనే ఆశతో కూడా ఉన్నారు. ఎందుకంటే ఇంతవరకు క్లీంకార పేస్ ని బయట ప్రపంచానికి రివీల్ చెయ్యలేదు.క్లీంకార చాలా సార్లు బయటకి వచ్చింది.ఆ సమయంలో చాలా మంది కెమెరాలలో బంధించడానికి చూసారు కానీ చరణ్, ఉపాసన ల తెలివి ముందు అది సాధ్యపడలేదు.ఏది ఏమైనా ఒక్కటి మాత్రం నిజం. వాళ్ళు నిర్ణయించుకున్న ముహుర్తానికే క్లీంకార ఫేస్ బయటి ప్రపంచానికి చూపిస్తారు.
![]() |
![]() |