![]() |
![]() |

బయట పుట్టే రూమర్స్ కి ఎలాంటి గుర్తింపు ఉంటుందో తెలియదు గాని, సినిమా ఇండస్ట్రీలో పుట్టే రూమర్స్ కి మాత్రం రాచ మర్యాదలు ఒక రేంజ్ లో జరుగుతాయి. పైగా అది నిజం అవ్వాలని కూడా కోరుకుంటారు. ఎందుకంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్(ntr)నాన్నకు ప్రేమతో అన్నాడు. యంగ్ డైరెక్టర్ శౌర్యవ్ హాయ్ నాన్న అన్నాడు. ఇది రూమర్ ఎందుకు అవుతుంది నిజమే కదా అని అనుకుంటున్నారా! ఈ వార్త నిజమే.కానీ ఆ ఇద్దరి గురించి కొన్ని రోజుల క్రితం ఒక రూమర్ వచ్చింది. అది నిజం కాదనీ పక్కా రూమర్ అని కన్ ఫార్మ్ అయ్యింది.
ఎన్టీఆర్ హాయ్ నాన్న డైరెక్టర్ శౌర్యవ్(shouryuv)తో సినిమాని చేయబోతున్నాడనే వార్తలు కొన్ని రోజుల క్రితం వచ్చాయి. ఒక యాక్షన్ కథని ఎన్టీఆర్ కి శౌర్యవ్ చెప్పాడని, ఎన్టీఆర్ కి నచ్చి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే వార్తలు వచ్చాయి. పైగా 2026 లో మొదటి భాగం 2028 లో రెండవ భాగం రిలీజ్ అవుతుందని ఒక రేంజ్ లోనే రూమర్స్ పుట్టుకొచ్చాయి.కానీ సినిమా ఫీల్డ్ లో ఏమైనా జరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి, ఆ న్యూస్ నిజమని అనుకున్న వాళ్ళు కూడా లేకపోలేదు. కాకపోతే అవన్నీ ఒట్టి పుకారులే అని స్వయంగా శౌర్యవ్ వెల్లడి చేసాడు.
కానీ ఆ రూమర్ ఏదో ఒక రోజు నిజమవ్వాలని, ఎన్టీఆర్ తో సినిమా తెరకెక్కించాలని అనుకుంటున్నానని కూడా చెప్పాడు. రీసెంట్ గా ఒక ఆంగ్ల ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆ విషయాలన్నీ వెల్లడి చేసాడు. నాని,మృణాల్ ఠాకూర్ జంటగా హాయ్ నాన్న వచ్చింది. మొదటి సినిమానే అయినా కూడా చాలా బరువైన కథని ఎంతో హృద్యంగా తెరకెక్కించి ప్రేక్షకుల విమర్శకుల ప్రశంసల్ని కూడా శౌర్యవ్ అందుకున్నాడు. నాని కెరిరీలోనే వన్ అఫ్ ది బిగెస్ట్ బ్లాక్ బస్టర్ గా కూడా హాయ్ నాన్న నిలిచింది. ప్రస్తుతం తన రెండో సినిమా ప్లాన్ లో ఉన్నాడు. ఎన్టీఆర్ దేవర తో బిజీగా ఉన్నాడు.
![]() |
![]() |