![]() |
![]() |

ఒకరు తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు(mahesh babu) ఇంకొకరు తమిళ సూపర్ స్టార్ సూర్య(suriya)ఈ ఇద్దరి మూవీ రిలీజ్ రోజు అయితే చూడాలి. థియేటర్స్ దగ్గర ఒక రేంజ్ లో హంగామా ఉంటుంది. అది చూడటానికి రెండు కళ్ళు కూడా చాలవు. అంతటి స్థాయిలో అభిమాన ఘనం ఉంది. మరి అలాంటి ఇద్దరి హీరోల గురించి వెరీ వెరీ స్పెషల్ న్యూస్ వస్తే ఇంకేమైనా ఉందా! సోషల్ మీడియా షేక్ అయిపోదు. ప్రస్తుతం అదే జరుగుతుంది.
రీసెంట్ గా సూర్య మాట్లాడుతు చెన్నైలోని సెయింట్ బీడ్ స్కూల్ వైపు వెళ్తే చిన్ననాటి విషయాలెన్నో గుర్తుకొస్తాయి. ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు అక్కడే చదువుకున్నాను. మహేష్ బాబు నా క్లాస్ మేట్. అలాగే ప్రముఖ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా(yuvan shankar raja)కూడా నా క్లాస్ మేట్ నే. ముగ్గురం కలిసి భోజనం చేసే వాళ్ళం.అదే విధంగా ఇంట్లో చేసిన వంటకాల్ని ఒకరి కోసం ఒకరం తీసుకెళ్లే వాళ్ళం. ఆ స్థాయిలో ఫ్రెండ్స్ షిప్ మాది. మా ముగ్గురి మధ్య ఎన్నో చర్చలు జరిగేవి.ప్రతి సారి కుటుంబ విషయాలు గురించి మాట్లాడుకునే వాళ్ళం. కానీ ఏ రోజు కూడా సినిమా విషయాల గురించి డిస్కస్ చేసే వాళ్ళం కాదు. కానీ చదువు పూర్తి అయ్యాక యువన్ నేను ఒకేసారి సినిమాల్లోకి వచ్చి ఒక పది సినిమాల దాకా కలిసి వర్క్ చేసాం. కానీ మహేష్ తో పని చేసే అవకాశం మాత్రం రాలేదని చెప్పాడు.
నిజానికి మహేష్ బాబు, సూర్య చిన్నప్పుడు కలిసి చదుకున్నారనే విషయం చాలా మందికి తెలియదు. దీంతో ఇప్పుడు ఈ మాటలు వైరల్ గా నిలుస్తున్నాయి. ఇక ఇద్దరి ఫ్యాన్స్ లో అయితే ఎనలేని ఎనర్జీ వస్తుంది. అంతే కాకుండా నయా డిమాండ్స్ ని కూడా ఇద్దరి ముందుకి తీసుకొస్తున్నారు. ఒకరికొకరు స్నేహితులు కాబట్టి కలిసి సినిమా చెయ్యాలని అంటున్నారు. పైగా సూర్య నటించడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి మహేష్ కూడా ఓకే అంటే మూవీ తెరకెక్కడం ఎంత సేపనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదే కనుక జరిగితే అభిమానులు ఆ ఇద్దరకీ గుడి కట్టడం కూడా ఖాయమని పలువురు సినీ ప్రేమికులు అభిప్రాయ పడుతున్నారు.
![]() |
![]() |