![]() |
![]() |
.webp)
నందమూరి బాలకృష్ణ (Balakrishna) తనయుడు మోక్షజ్ఞ (Mokshagna) త్వరలోనే సినీ రంగ ప్రవేశం చేయనున్న సంగతి తెలిసిందే. మోక్షజ్ఞ మొదటి చిత్రానికి 'హనుమాన్' ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించనున్నాడు. అధికారిక ప్రకటన రాకముందే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇప్పుడు ఈ సినిమా గురించి వినిపిస్తున్న ఓ న్యూస్ ఆ అంచనాలను మరోస్థాయికి తీసుకెళ్తోంది.
మోక్షజ్ఞ కోసం ప్రశాంత్ వర్మ.. మైథలాజికల్ టచ్ ఉన్న కథను సిద్ధం చేశాడట. మహాభారతంలో నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందట. అంతేకాదు, ఇందులో అభిమన్యుడు పాత్రలో మోక్షజ్ఞ కనిపించనున్నాడని తెలుస్తోంది. అభిమన్యుడు అర్జునుడి కుమారుడు. మహాభారతంలోని గొప్ప యోధులలో ఒకడు. అలాంటి అభిమన్యుడి పాత్రలో మోక్షజ్ఞ నటించనున్నాడనే వార్త ఆసక్తికరంగా మారింది.
పౌరాణిక పాత్రలకు నందమూరి కుటుంబం పెట్టింది పేరు. అప్పట్లో ఎన్టీఆర్ ఎన్నో పౌరాణిక పాత్రలకు ప్రాణం పోశారు. తెలుగువారికి రాముడైనా, కృష్ణుడైనా ఎన్టీఆరే అన్నంతగా పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ వారసత్వాన్ని కొనసాగిస్తూ పలు పౌరాణిక పాత్రలలో నటించి మెప్పించారు. ఇప్పుడు మోక్షజ్ఞ కూడా తన తాత, తండ్రి బాటలో పయనిస్తూ.. మొదటి సినిమాకే పౌరాణిక పాత్ర చేయడానికి సిద్ధమవ్వడం విశేషం.
![]() |
![]() |