![]() |
![]() |

చాందిని చౌదరి (Chandini Chowdary) ప్రధాన పాత్రలో ప్రకాష్ దంతులూరి దర్శకత్వంలో రూపొందిన సినిమా 'యేవమ్' (Yevam). నవదీప్, పవన్ గోపరాజు సంయుక్తంగా నిర్మించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీలో వశిష్ట సింహా, భరత్‌రాజ్, ఆషు రెడ్డి తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. జూన్ 14న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం పరవాలేదు అనిపించుకుంది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలో అలరించడానికి సిద్ధమైంది.
'యేవమ్' మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ఆహా సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని జూలై 25 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు తాజాగా ఆహా ప్రకటించింది. ఈ విషయాన్ని విడుదలకు కొద్దిగంటల ముందు ప్రకటించడం విశేషం. మరి ఈ చిత్రానికి ఓటీటీలో ఎలాంటి స్పందన లభిస్తుందో చూడాలి.

కీర్తన శేషు, నీలేష్ మందలపు సంగీతం అందించిన 'యేవమ్' చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా ఎస్‌వీ విశ్వేశ్వర్, ఎడిటర్ గా సుజనా అడుసుమిల్లి వ్యవహరించారు.
![]() |
![]() |