![]() |
![]() |

తాజాగా ఎన్డీఏ సర్కార్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై ఎప్పటిలాగే మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. కొందరు బడ్జెట్ అద్భుతంగా ఉందని ప్రశంసిస్తుంటే.. మరికొందరు మాత్రం బడ్జెట్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా ఇండియా కూటమి నేతలు, మద్దతుదారులు ఓ రేంజ్ లో విమర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ (Kamal Haasan) తనదైన శైలిలో స్పందించారు.
మక్కల్ నీది మయ్యమ్ పార్టీని స్థాపించిన కమల్ హాసన్ రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండే సంగతి తెలిసిందే. ముఖ్యంగా బీజేపీ పైనా, ఎన్డీఏ సర్కార్ పైనా విమర్శలు చేస్తుంటారు. తాజాగా కేంద్ర బడ్జెట్‌పై కూడా సెటైర్లు వేశారు. "NDA బడ్జెట్ సందర్భంగా శుభాకాంక్షలు. త్వరలో INDIA బడ్జెట్ వస్తుందని ఆశిస్తున్నా" అని కమల్ ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్ పరోక్షంగా INDIA కూటమి పవర్ లోకి రావాలని చెప్పినట్లుగా ఉంది. దీనిపై నెటిజన్లు భిన్నంగా కామెంట్స్ చేస్తున్నారు. కొందరు కమల్ ట్వీట్ ని ఎంజాయ్ చేస్తుండగా.. మరికొందరు మాత్రం ట్రోల్ చేస్తున్నారు. "ముందు ఇండియన్-2 మూవీ బడ్జెట్ ఎంతో చెప్పండి", "ఇండియన్-2 బడ్జెట్ రికవర్ చేయడానికి ట్రై చేయండి" అంటూ కమల్ కు కౌంటర్ ఇస్తున్నారు.

![]() |
![]() |