![]() |
![]() |

పార్తీబన్(parthiban)తమిళ చిత్ర పరిశ్రమలో తిరుగులేని హీరో అండ్ దర్శకుడు. 1989 లో స్వీయ దర్శకత్వంలో వచ్చిన పుదియ పాదే తో తెరంగ్రేటం చేసాడు. ఎన్నో భారీ హిట్ చిత్రాలు ఆయన ఖాతాలో ఉన్నాయి. నేషనల్ అవార్డు ని సైతం రెండు సార్లు అందుకున్నాడంటే పార్తీబన్ స్టామినా ఏ పాటిదో అర్ధం చేసుకోవచ్చు. అలాంటి వ్యక్తి ఇప్పుడు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ని తక్కువ చేసి మాట్లాడాడని రజనీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో పార్తీబన్ మాట్లాడుతు ఎవరి సినిమా అయినా హిట్ అవ్వాలంటే అందులో తమన్నా(tamannaah)ఐటెం సాంగ్ ఉంటే చాలు. కథ గాని వేరే విషయాల గురించి గాని అవసరం లేదు.తమన్నా ఐటెం సాంగ్ ఉంటే హిట్ అనే కామెంట్స్ ని చేశాడు.ఇప్పుడు అవి రజనీ(rajinikanth)డై హార్ట్ ఫ్యాన్స్ కి కోపాన్ని తెప్పిస్తున్నాయి. పార్తీబన్ ఉద్దేశ్యం ప్రకారం తమన్నా వల్ల జైలర్ ఆడిందా అంటు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. అలాంటి మాటలు మాట్లాడేముందు ఒకసారి అలోచించి మాట్లాడాలని పార్తీబన్ కి హితవు చెప్తున్నారు. పార్తీబన్ ఫ్యాన్స్ కూడా రజనీ ఫ్యాన్స్ కి ధీటుగా రిప్లై ఇస్తున్నారు.రజనీ నే కాదు ఏ హీరో ని కూడా తక్కువ చేసే ఉద్దేశ్యం పార్తీబన్ కి లేదు. కేవలం ఒక సెంటిమెంట్ గానే చెప్పారని అంటున్నారు. జైలర్ లో తమన్నా నువ్వే కావాలయ్యా సాంగ్ ఎంతగా పాపులర్ అయ్యిందో తెలిసిందే
ఇక లేటెస్ట్ గా జులై పన్నెండు న పార్తీబన్ దర్శకత్వంలో తెరకెక్కిన టీన్జ్ అనే మూవీ రిలీజ్ అయ్యింది. ఆయనే హీరో అండ్ దర్శకుడు.ఇందులో కూడా తమన్నా ఒక ప్రత్యేక గీతం చేసింది. సదరు సాంగ్ కి మంచి పేరు కూడా వస్తుంది. కమల్ హాసన్(kamal haasan)భారతీయుడు 2 సినిమాతో పాటే వచ్చిన టీన్జ్ ప్రేక్షకుల ఆదరణ పొందుతుంది. ముద్దుల మావయ్య లో బాలకృష్ణ చెల్లెలుగా చేసి గుర్తింపు పొందిన సీత నే పార్తిబన్ పెళ్లి చేసుకున్నాడు.
![]() |
![]() |