![]() |
![]() |
.webp)
జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'దేవర' (Devara). అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ గా 'ఫియర్ సాంగ్' విడుదలై ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. రోజురోజుకి ఈ సాంగ్ కి క్రేజ్ పెరుగుతోంది. ప్రస్తుతం #Fearsong హ్యాష్ ట్యాగ్ ఎక్స్(ట్విట్టర్) లో నేషనల్ వైడ్ గా ట్రెండ్ అవుతోంది.
అనిరుధ్ స్వరపరిచే హీరో ఎలివేషన్ సాంగ్స్ స్లో పాయిజన్ లా ఎక్కుతుంటాయి. 'ఫియర్ సాంగ్' కూడా అదే బాటలో పయనిస్తోంది. రోజురోజుకి ఈ సాంగ్ ని ఇష్టపడే వారి సంఖ్య పెరుగుతోంది. అన్ని భాషల్లో కలిపి ఇప్పటికే యూట్యూబ్ లో దాదాపు 100 మిలియన్ వ్యూస్ కి సొంతం చేసుకోగా.. స్పాటిఫై లో 10 మిలియన్ మిలియన్ కి పైగా స్ట్రీమ్స్ సొంతం చేసుకుంది. ఇటీవల కాలంలో ఏ ఫస్ట్ సింగిల్ కి ఈ రేంజ్ రెస్పాన్స్ రాలేదని చెప్పవచ్చు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతూ.. #Fearsong హ్యాష్ ట్యాగ్ ని ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తున్నారు.
ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై రూపొందుతోన్నదేవర మూవీలో జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్ కాగా, సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, షైన్ టామ్ చాకో తదితరులు నటిస్తున్న ఈ మూవీ రెండు భాగాలుగా రూపొందుతోంది. మొదటి భాగం సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.
![]() |
![]() |