![]() |
![]() |
‘కల్కి’ రిలీజ్‌కి ముందే ఇటలీలోని తన ఇంటికి వెళ్లి సినిమా సూపర్ సక్సెస్‌ని అక్కడే ఎంజాయ్ చేశాడు. రెండు వారాలు అక్కడ స్పెండ్ చేసిన తర్వాత హైదరాబాద్ చేరుకున్నాడు. ఇప్పుడు నెక్స్‌ట్ ఏంటి? అనే ప్రశ్న అందరిలోనూ మెదులుతోంది. మారుతి దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తున్న ‘రాజాసాబ్’ చిత్రానికి మొదట ప్రిఫరెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పటివరకు ఈ సినిమాకి ప్రభాస్ పనిచేసింది తక్కువ రోజులే. అయినా ప్రభాస్ కోసమే ఎదురుచూడకుండా అతను లేకుండా తియ్యాల్సిన సన్నివేశాలను పూర్తి చేశాడు మారుతి. కేవలం ప్రభాస్ ఉంటేనే తప్ప తియ్యలేని షాట్స్ అనేకం ఉన్నాయి. అందుకే ‘రాజాసాబ్’ని పూర్తి చెయ్యడానికే ప్రభాస్ ఫిక్స్ అయ్యాడని తెలుస్తోంది.
సలార్2, కల్కి2 చిత్రాల షూటింగ్స్ ఇప్పట్లో లేవు. అలాగే హను రాఘవపూడితో అనుకున్న సినిమా కూడా సెట్స్‌పైకి వెళ్ళేందుకు మరికొంత సమయం పడుతుంది. అందువల్ల ప్రభాస్ ముందు ఉన్న ఒకే ఒక ఆప్షన్ ‘రాజా సాబ్’ని పూర్తి చేయడమే. ఈనెలాఖరులో కొత్త షెడ్యూల్ ప్రారంభమవుతుందట. ఈ సినిమాను వచ్చే ఏడాది ప్రథమార్థంలో రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి ప్రభాస్ ఓ రెండు నెలలు ఈ సినిమా కోసం కేటాయిస్తే సినిమా షూటింగ్ పూర్తయ్యే అవకాశం ఉంటుంది. మరి ప్రభాస్, మారుతి ఏ నిర్ణయం తీసుకుంటారో, షూటింగ్ ఎప్పుడు మొదలు పెడతారో తెలియాలంటే కొన్నిరోజులు వేచి వుండక తప్పదు
![]() |
![]() |