![]() |
![]() |

బాబాయ్, అబ్బాయి లైన విక్టరీ వెంకటేష్(venkatesh)రానా(rana)తండ్రి,కొడుకులుగా నటించిన వెబ్ సిరీస్ రానా నాయుడు(rana naidu)నాగ నాయుడు, రానా నాయుడు క్యారెక్టర్స్ లో ఇద్దరు పోటీ పడి మరి నటించారు. గత సంవత్సరం పది ఎపిసోడ్స్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.హిందీ సిరీస్ అనే పేరే కానీ తెలుగు ప్రేక్షకుల అదరణని కూడా పొందింది. అడల్ట్ కంటెంట్ ని పులుముకుందనే ప్రచారం వచ్చినా కూడా విజయాన్ని మాత్రం తన ఖాతాలో వేసుకుంది. ఇందుకు నిదర్శనంగా రానా నాయుడు రానాకి ఒక అరుదైన గౌరవాన్ని తెచ్చిపెట్టింది.
ఇండియన్ టెలి అవార్డు(indian telly award)హిందీలో తెరకెక్కే పలు టెలి సిరీస్ కి సంబంధించి అత్యుత్తమ ప్రతిభ కనపర్చిన వారికి అవార్డ్స్ ఇస్తుంటుంది. 2001 నుంచి సదరు అవార్డ్స్ ని ఇవ్వడం ప్రారంభించారు. ఇప్పుడు రానా నాయుడు సిరీస్ కి గాను రానాని ఉత్తమ నటుడుగా ప్రకటించారు. ఒక తెలుగు నటుడు ఎంటైర్ హిందీ సిరీస్ లన్నింటికీ సంబంధించి వాటిల్లో ఉత్తమ నటుడుగా అవార్డు తీసుకోవడం గ్రేట్ అని చెప్పాలి. ఇక ఈ సందర్భంగా రానా తన ప్రతి స్పందనని కూడా తెలియచేసాడు. అవార్డు రావడం చాలా ఆనందంగా ఉంది. సిరీస్ లో ఎన్నో ఇబ్బందికర అంశాలు ఉన్నప్పటికీ ఎంతో దైర్యంగా తెరకెక్కించాం. రిలీజ్ తర్వాత కొంత మంది నుంచి విమర్శలు వచ్చినప్పటికి ప్రేక్షకాదరణతో సంచలన విజయాన్ని సాధించింది. గ్లోబల్ స్థాయిలో ఎక్కువ వ్యూస్ ని సాధించిన వాటిల్లో టాప్ గా నిలిచిందని కూడా చెప్పాడు.
.webp)
ఇక రానా నాయుడు సిరీస్ అమెరికన్ ఫేమస్ సిరీస్ రే డొనో వన్ కు రీమేక్ గా రూపొందింది. లేటెస్ట్ గా మేకర్స్ నుంచి ఒక ప్రకటన వచ్చింది. మరెన్నో ట్విస్ట్ లు, మరింత ఫ్యామిలీ డ్రామాతో రానా నాయుడు పార్ట్ టూ కూడా త్వరలోనే వస్తుందని తెలిపారు. ఇక పార్ట్ వన్ కి సుపెర్న్ వెర్మ, కరన్ అన్షుమన్ లు దర్శకత్వం వహించగా సుందర్ ఆరోన్ నిర్మాతగా వ్యవహరించాడు. సుచిత్ర పిళ్ళై, రజని బాసుమతరీ, గౌరవ్ చోప్రా, సర్వీన్ చావ్లా తదితరులు ప్రధాన పాత్రల్లో మెరిశారు.
![]() |
![]() |