![]() |
![]() |
.webp)
ఆగస్టు నెల మెగా అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇవ్వబోతుంది. వారం వ్యవధిలో రెండు సర్ ప్రైజ్ లు రాబోతున్నాయి. అందులో ఒకటి 'గేమ్ ఛేంజర్' (Game Changer)కి సంబంధించిన సర్ ప్రైజ్ కాగా, మరొకటి 'విశ్వంభర' (Vishwambhara)కి సంబంధించిన సర్ ప్రైజ్.
రామ్ చరణ్ (Ram Charan) హీరోగా శంకర్ డైరెక్షన్ లో రూపొందుతోన్న చిత్రం 'గేమ్ ఛేంజర్'. దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ పొలిటికల్ థ్రిల్లర్ నుంచి.. ఒక పాట, కొన్ని పోస్టర్లు తప్ప పెద్దగా ఎటువంటి కంటెంట్ విడుదల కాలేదు. దీంతో ఈ సినిమా నుంచి ఓ సాలిడ్ అప్డేట్ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఇన్నాళ్లకు వారి ఎదురుచూపులు ఫలించబోతున్నాయి. స్వాతంత్య్ర దినోత్సవం కానుకగా ఆగస్టు 15న 'గేమ్ ఛేంజర్' గ్లింప్స్ విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించినట్లు సమాచారం. ఈ మూవీ ఈ ఏడాది డిసెంబర్ లో లేదా వచ్చే ఏడాది వేసవిలో విడుదలయ్యే అవకాశముంది.

చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా మల్లిడి వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'విశ్వంభర'. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సోషియో ఫాంటసీ ఫిల్మ్ సంక్రాంతి కానుకగా జనవరి 10న థియేటర్లలో అడుగు పెట్టనుంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి త్వరలోనే బిగ్ సర్ ప్రైజ్ రాబోతున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి పుట్టినరోజు కానుకగా ఆగస్టు 22న 'విశ్వంభర' ఫస్ట్ లుక్ టీజర్ ను విడుదల చేయనున్నారని వినికిడి.
![]() |
![]() |