![]() |
![]() |

అజయ్ ఘోష్ (Ajay Ghosh), చాందిని చౌదరి (Chandini Chowdary) ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం 'మ్యూజిక్ షాప్ మూర్తి' (Music Shop Murthy). ఫ్లై హై సినిమాస్ బ్యానర్ లో శివ పాలడుగు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా జూన్ 14న థియేటర్లలో విడుదలైంది. "జీవితంలో ఏదైనా సాధించాలంటే.. వయసు అడ్డు కాదు" అనే పాయింట్ తో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకుల మెప్పుతో పాటు విమర్శకుల ప్రశంసలు పొందింది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది.
'మ్యూజిక్ షాప్ మూర్తి' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ఓటీటీ వేదికలు అమెజాన్ ప్రైమ్ వీడియో, ఈటీవీ విన్ సొంతం చేసుకున్నాయి. తాజాగా ఈ చిత్రం ఈ రెండు ఓటీటీ వేదికల్లోకి అడుగుపెట్టింది. జూలై 16 నుంచి ప్రైమ్ వీడియోతో పాటు ఈటీవీ విన్ లో స్ట్రీమ్ అవుతోంది. కుటుంబమంతా కలిసి చూడదగ్గ ఇలాంటి చిత్రాలకు ఓటీటీలో ఆదరణ ఎక్కువగా ఉంటుంది. మరి 'మ్యూజిక్ షాప్ మూర్తి' ఓటీటీలో ఏ స్థాయి ఆదరణ పొందుతుందో చూడాలి.
'మ్యూజిక్ షాప్ మూర్తి' మూవీ రివ్యూ
ఆమని, అమిత్ శర్మ, భాను చందర్, దయానంద్ రెడ్డి తదితరులు నటించిన ఈ చిత్రానికి పవన్ సంగీతం అందించగా.. సినిమాటోగ్రాఫర్ గా శ్రీనివాస్ బెజుగం, ఎడిటర్ గా నాగేశ్వర్ రెడ్డి వ్యవహరించారు.
![]() |
![]() |