![]() |
![]() |

సినిమాల ఎంపికలో వైవిధ్యం చూపించే యంగ్ స్టార్స్ లో న్యాచురల్ స్టార్ నాని (Nani) ముందు వరుసలో ఉంటాడు. గతేడాది నాని రెండు విభిన్న చిత్రాలతో ప్రేక్షకులను అలరించాడు. అందులో ఒకటి ఊర మాస్ మూవీ 'దసరా' కాగా, మరొకటి క్లాస్ ఫిల్మ్ 'హాయ్ నాన్న'. ఈ రెండూ కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించాయి. ఇక 2023 ఏడాదికి గాను తాజాగా ప్రకటించిన సైమా అవార్డ్స్ (SIIMA Awards) నామినేషన్స్ లోనూ సత్తా చాటాయి.
సైమా అవార్డ్స్ లో 'దసరా' (Dasara) సినిమా 11 విభాగాల్లో నామినేట్ అవ్వగా, 'హాయ్ నాన్న' (Hi Nanna) చిత్రం 10 విభాగాల్లో నామినేట్ అయింది. అంటే నాని నటించిన ఈ రెండు సినిమాలు ఏకంగా 21 నామినేషన్లతో సంచలనం సృష్టించాయి. ఉత్తమ చిత్రం విభాగంలో ఈ రెండు సినిమాలూ నామినేట్ అవ్వడం మరో విశేషం. మరి ఈ 21 నామినేషన్లకు గాను 'దసరా', 'హాయ్ నాన్న' చిత్రాలు ఎన్ని అవార్డులను ఖాతాలో వేసుకుంటాయో చూడాలి. కాగా, సైమా అవార్డుల వేడుక సెప్టెంబర్ 14,15 తేదీల్లో దుబాయ్ లో జరగనుంది.
![]() |
![]() |