![]() |
![]() |
.webp)
ప్రముఖ కామెడీ నటుడు, కాదు కాదు..ప్రముఖ హీరో ప్రియదర్శి (priaydarshi)ని తక్కువ అంచనా వేశామా! సినీ బాక్స్ ఆఫీస్ లో కాలు వేసినట్టే. అవును 100 % సినీ బాక్స్ ఆఫీస్ లో కాలు వేసినట్టే. ఆ మాట ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే తన అప్ కమింగ్ మూవీ ఒక రేంజ్ లో బిజినెస్ చేసింది. ఆ వివరాలు చూద్దాం.
ప్రియదర్శి అప్ కమింగ్ మూవీ డార్లింగ్(darling)ఇస్మార్ట్ పోరి నబా నటేష్ (naba natesh)హీరోయిన్. ఈనెల 19 న విడుదల కాబోతుంది. ఇప్పుడు ఈ మూవీ కళ్ళు చెదిరే బిజినెస్ ని లాక్ చేసుకుంది. పైగా అగ్ర నిర్మాణ సంస్థలైన మైత్రి మూవీ మేకర్స్ , ఏషియన్, సురేష్ ప్రొడక్షన్స్ సంస్థలు ఆ హక్కులని పొందాయి. తెలంగాణ ఏరియాకి సంబంధించి మైత్రి మూడున్నర కోట్లకి పొందింది. ఏపి హక్కులని భారీ ఫ్యాన్స్ రేట్ కి ఏషియన్, సురేష్ లు దక్కించుకున్నాయి. అలాగే నాన్ థియేట్రికల్ రైట్స్ ని స్టార్ మా ఏకంగా ఆరు కోట్లకి దక్కించుకుంది.ఇప్పుడు ఈ బిజినెస్ టాక్ అఫ్ ది ఇండస్ట్రీ గా మారింది. అదే విధంగా ప్రియదర్శి కెరీర్ లో ఇంత పెద్ద మొత్తంలో బిజినెస్ జరుపుకోవడం ఇదే ఫస్ట్ టైం.
.webp)
ఇక డార్లింగ్ మూవీని ఇటీవల హనుమన్ (hanuman)తో సంచలన విజయాన్ని అందుకున్న నిరంజన్ రెడ్డి (niranjanreddy)నిర్మించగా అశ్విన్ రామ్(aswin ram) దర్శకత్వాన్ని వహించాడు. వకీల్ సాబ్ (vakeel saab)ఫేమ్ అనన్య నాగళ్ళ, బ్రహ్మానందం, రఘుబాబు, బలగం మురళి గౌడ్ తదితరులు ముఖ్య పాత్రల్లో చేస్తున్నారు. ప్రియదర్శి అయితే వరుస హిట్స్ తో మంచి ఫామ్ లో ఉన్నాడు. ఈ నేపథ్యంలో డార్లింగ్ పక్కా హిట్ అనే సంకేతాలు ఇండస్ట్రీ నుంచి వినిపిస్తున్నాయి. ఆల్రెడీ ప్రచార చిత్రాలు, ట్రైలర్ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకున్నాయి. పక్కా రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా డార్లింగ్ తెరకెక్కింది.
![]() |
![]() |