![]() |
![]() |

బాక్సాఫీస్ దగ్గర 'కల్కి 2898 AD' (Kalki 2898 AD) ప్రభంజనం కొనసాగుతోంది. ముఖ్యంగా ఓవర్సీస్ లో రికార్డుల దుమ్ముదులుపుతోంది. తాజాగా నార్త్ అమెరికాలో సరికొత్త రికార్డు సృష్టించింది.
నార్త్ అమెరికాలో అత్యధిక వసూళ్లు రాబట్టిన ఇండియన్ సినిమాల్లో రెండో స్థానంలో 'కల్కి' నిలిచింది. ఇప్పటిదాకా 17.48 మిలియన్ డాలర్లతో 'పఠాన్' రెండో స్థానంలో ఉండగా.. దానిని వెనక్కటి నెట్టేసి 17.50 మిలియన్ డాలర్లతో 'కల్కి' టాప్-2 లోకి వచ్చింది. కేవలం 17 రోజుల్లోనే 'కల్కి' ఈ ఫీట్ సాధించడం విశేషం.
కాగా, నార్త్ అమెరికాలో అత్యధిక వసూళ్లు రాబట్టిన ఇండియన్ సినిమాగా 20.77 మిలియన్ డాలర్లతో 'బాహుబలి-2' మొదటి స్థానంలో ఉంది. నార్త్ అమెరికాలో 'కల్కి' జోరు ఇలాగే కొనసాగితే.. ప్రభాస్ తన 'బాహుబలి-2' రికార్డుని తానే బ్రేక్ చేసే అవకాశముంది.
![]() |
![]() |