![]() |
![]() |

విజయ్ దేవరకొండ(vijay devarakonda)ఒక సినిమా ఫంక్షన్ లో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు(dil raju)విజయ్ సినీ జాతకం ఎప్పుడో చెప్పేసాడు. పవన్ కళ్యాణ్(pawan kalyan)లాగా సినిమా ప్లాప్ అయినా కూడా విజయ్ క్రేజ్ మాత్రం తగ్గదని చెప్పాడు. అది నూటికి నూరుపాళ్లు నిజం అనేలా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.ఇందుకు నిదర్శనంగా ఒక వైపు జర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక మూవీ చేస్తున్నాడు. ప్రెజంట్ శరవేంగా షూటింగ్ ని జరుపుకుంటుంది. ఇంకో వైపు రెండు భారీ ప్రాజెక్ట్ లని కూడా అనౌన్స్ చేసాడు. వాటిల్లో ఒకటి మైత్రి మూవీస్ ది కాగా రెండవ దానికి దిల్ రాజు దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు. విజయ్ బిజీ ని. పైగా రెండు కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ తో కూడుకున్నవే. ఇక సినిమాల విషయం కాసేపు పక్కన పెడితే విజయ్ చేస్తున్న సామజిక సేవ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
విజయ్ దేవరకొండ ఎన్నో ఏళ్ళ నుంచే తన ఫౌండేషన్ ద్వారా ఆపదలో ఉన్న ప్రజల్ని ఆదుకుంటు వస్తున్నాడు. మొన్న తన ఖుషి మూవీ రిలీజ్ టైం లో కూడా వంద మంది పేద కుటుంబాలకి తలో ఒక లక్ష రూపాయిలు చొప్పున కోటి రూపాయిలు ఇచ్చాడు. కరోనా సమయంలో కూడా చాలా మందిని ఆదుకున్నాడు.ఇక రీసెంట్ గా మరికొన్ని విషయాలు బయటకి వచ్చాయి. ఇందుకు తెలుగు ఇండియన్ ఐడియల్ వేదిక అయ్యింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఒక ట్రాన్స్ జెండర్ విజయ్ ని దేవుడుతో పోల్చుతు తనకి చేసిన సాయం గురించి చెప్పింది. విజయ్ ఫౌండేషన్ కి సాయం కోసం కాల్ చేశాను. తిరిగి పదిహేను నిమిషాల్లో రిటర్న్ కాల్ చేసి డీటెయిల్స్ తీసుకున్నారు. ఆ తర్వాత నాతో పాటు పద్దెనిమిది మందికి హెల్ప్ చేసారని చెప్పింది. అలాగే ఆంధ్రప్రదేశ్ లోని మార్కాపురంకి చెందిన ఒక కుటుంబం కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యింది. తమ బాబు శస్త్ర చికిత్స కి విజయ్ భారీ సాయం చేసాడని చెప్పుకొచ్చారు.
.webp)
ఇక ఇందులో విజయ్ దేవరకొండ కూడా పాల్గొన్నాడు. ఇది నా ఒక్కడి వల్లే సాధ్యం కాలేదు. చాలా మంది నా ఫౌండేషన్ కి ఐదు వందలు, వెయ్యి రూపాయిలు సాయం చేసారు. అలాంటి వాళ్ళందరి వల్లే నేను పది మందికి సాయం చేస్తున్నాను. ఇంత మంచి మనుషుల మధ్య ఉండటం మన అదృష్టం అంటు చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఈ తతంగమంతా సోషల్ మీడియాలో వైరల్ అవుతు ఉంది.
![]() |
![]() |