![]() |
![]() |

డి జె టిల్లు (dj tillu)లో టిల్లు చేత నేహా శెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించింది. టిల్లు స్క్వేర్ (tillu square)లో అనుపమ పరమేశ్వరన్ అయితే ఏకంగా మూడు చెరువుల కూల్ డ్రింక్స్ నే తాగించింది. మరి ఇప్పుడు టిల్లు స్క్వేర్ కి సీక్వెల్ గా తెరకెక్కబోతున్న టిల్లు క్యూబ్ లో ఏ హీరోయిన్ చెయ్యబోతుంది. టిల్లు చేత ఆ ఇద్దర్ని మించి ఏం తాగించబోతుంది.
టిల్లు స్క్వేర్ సీక్వెల్ కి టిల్లు క్యూబ్ అనే పేరుని ఫిక్స్ చేశారనే వార్తలు వస్తున్నాయి. అలాగే లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం అందాల భామ ప్రియాంకా జవాల్కర్(priyanka jawalkar)ని హీరోయిన్ గా ఫిక్స్ చేశారనే ప్రచారం జరుగుతుంది.ఇదే కనుక నిజమైతే టిల్లు ఫ్యాన్స్ కి పండగే అని చెప్పవచ్చు. ఎందుకంటే నేహా, అనుపమ పరమేశ్వరన్ లని మించిన అందం ప్రియాంక సొంతం. అలాగే పెర్ ఫార్మన్స్ పరంగా కూడా ఒక రేంజ్ లో తన సత్తా చాటగలదు. ఇందుకు తన గత చిత్రాలే ఉదాహరణ. 2017 లో కలవరమాయే తో ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక ఆ తర్వాత టాక్సీవాలా ,తిమ్మరసు, ఎస్ఆర్ కల్యాణమండపం, గమనం లాంటి సినిమాల్లో చేసింది. టిల్లు స్క్వేర్ లో కూడా కామియో అప్పీరియన్సు ఇచ్చింది. ఇక ప్రియాంక విషయాన్ని మేకర్స్ త్వరలోనే అధికారకంగా ప్రకటించబోతున్నారని కూడా అంటున్నారు.
ఇక టిల్లు క్యూబ్ ని ఎవరు నిర్మిస్తారో అనే విషయం కూడా త్వరలోనే తెలియనుంది.మోస్ట్ లీ టిల్లు స్క్వేర్ ని నిర్మించిన అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నే నిర్మించవచ్చు. అలాగే దర్శకుడు విషయంలో కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. డి జె టిల్లు కి విమల్ కృష్ణ దర్శకత్వం వహించగా టిల్లు స్క్వేర్ కి మల్లిక్ రామ్ దర్శకత్వం వహించాడు. ఏది ఏమైనా టిల్లు గా సిద్దు జొన్నలగడ్డ(siddu jonnalagadda)మరోసారి తన మాటలతో, చూపులతో సరికొత్త నవ్వుల సామ్రాజ్యాన్ని స్థాపించడం ఖాయం.
![]() |
![]() |