![]() |
![]() |
.webp)
రవితేజ (ravi teja) హీరోగా వచ్చిన షాక్ తో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన వ్యక్తి హరీష్ శంకర్(harsih shankar)ఆ తర్వాత మిరపకాయ్, గబ్బర్ సింగ్(gabbar singh) తో స్టార్ డైరెక్టర్ గా అవతరించాడు. ప్రస్తుతం రవితేజ తోనే మిస్టర్ బచ్చన్ అనే మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో హరీష్ చేసిన తాజా ట్వీట్ ఒకటి వైరల్ గా మారింది.
మిస్టర్ బచ్చన్ కి సంబంధించి సోషల్ మీడియాలో కొన్ని రోజులుగా రకరకాల చర్చలు జరుగుతున్నాయి. కొంత మంది జర్నలిస్ట్ లు సినిమాకి సంబంధించిన లీకులని ఇస్తున్నారనే ప్రచారం కూడా ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే హరీష్ ట్వీట్ చేసాడు. సినిమా రిలీజ్ దగ్గరపడుతోంది కదా! ఎలాంటి పోస్ట్ చేసినా తగ్గుతాడు అని ఒక ముసలి నక్క మళ్ళీ మొదలుపెడుతుంది. దయచేసి అలాంటి అపోహలు పెట్టుకోవద్దని మనవి. నా జోలికి వస్తే రేపు రిలీజ్ అయ్యాక కూడా వదలను అని చెప్పుకొచ్చాడు.ఎవర్ని ఉద్దేశించి హరీష్ ఆ వ్యాఖ్యలు చేసుంటాడని ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో జోరుగా చర్చ జరుగుతుంది. గతంలో హరీష్ తాలూకు వీడియోలు చూసి ఈ మాటలకి వాటికి సింక్ ఏమైనా అవుతుందేమో అని కూడా చెక్ చేస్తున్నారు.
ఇక హరీష్ ఖాతాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఉంది. కొంత భాగం షూటింగ్ ని కూడా జరుపుకుంది. పాలిటిక్స్ లో పవన్ బిజీగా ఉండటంతో సినిమా లేటు అవుతు వస్తుంది.ఈ గ్యాప్ లోనే రవితేజ తో మిస్టర్ బచ్చన్ తెరకెక్కిస్తున్నాడు. అగస్ట్ 15 రిలీజ్ చెయ్యాలనే ప్లాన్ లో ఉన్నాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుండగా భాగ్య శ్రీ భోస్లే హీరోయిన్ గా చేస్తుంది. మిక్కీ జె మేయర్ సంగీత దర్శకుడు.
![]() |
![]() |