![]() |
![]() |

'నమో వెంకటేశ' సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. "నాకు ఎవరైనా అన్యాయం చేయాలని చూస్తే.. వాళ్లే అన్యాయం అయిపోతారు" అని ఆ సినిమాలో మంచికి మారు పేరైన హీరో పాత్రధారి వెంకటేష్ చెబుతాడు. అవును నిజమే.. వాళ్ళ మానాన వారి పని చేసుకుంటున్న మంచి వాళ్ళని.. అన్యాయంగా టార్గెట్ చేస్తే.. అది రివర్స్ అయ్యి మనకే చెడు జరుగుతుంది. ఇప్పుడు ప్రభాస్ (Prabhas) విషయంలో ఒక ముగ్గురికి ఇలాగే జరిగిందనే చర్చ జరుగుతోంది.
సినీ పరిశ్రమలో వివాదరహితుడు, అందరితో మంచిగా ఉండే వ్యక్తిగా ప్రభాస్ కి పేరుంది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం ప్రభాస్ సొంతం. డార్లింగ్ అని పిలుస్తూ చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరితో ఎంతో ప్రేమగా ఉంటాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే.. మంచితనం, మొహమాటం కలగలిసిన నిండైన రూపం ప్రభాస్. అలాంటి వ్యక్తిని కొందరు కావాలని అన్యాయంగా టార్గెట్ చేశారు. ఇప్పుడు వాళ్ళే అన్యాయం అయిపోయారు.

"ప్రభాస్ కెరీర్ అయిపోయింది" అంటూ వేణు స్వామి కామెంట్స్ చేశాడు. కట్ చేస్తే ప్రభాస్ 'సలార్', 'కల్కి' సినిమాలతో బాక్సాఫీస్ ని షేక్ చేశాడు. వేణు స్వామి మాత్రం తను చెప్పిన జాతకాలన్నీ తప్పయ్యి.. తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. చివరికి జాతకాలు చెప్పడమే మానేస్తున్నట్లు ప్రకటించాడు.
ఇక 2023 డిసెంబర్ లో ప్రభాస్ నటించిన 'సలార్', కన్నడ హీరో దర్శన్ నటించిన 'కాటేరా' సినిమాలు విడుదలయ్యాయి. అయితే ఆ సమయంలో దర్శన్ అనవసరంగా నోరుపారేసుకున్నాడు. "సలార్ కి మేము భయపడం.. మాకే సలార్ భయపడాలి" అని ప్రభాస్ స్టార్డంని తక్కువ చేసేలా మాట్లాడాడు. మామూలుగా ఒకే సమయంలో సినిమాలు విడుదలైతే.. ఏ హీరో అయినా "తమ సినిమాతో పాటు మిగతా సినిమాలు కూడా ఆడాలి" అని కోరుకుంటారు. కానీ దర్శన్ మాత్రం అవసరంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. కట్ చేస్తే ఒక హత్య కేసులో జైలుపాలయ్యాడు.
ఇప్పుడు ప్రణీత్ హనుమంతు అనే యూట్యూబర్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఇతను ప్రభాస్ ని ఎన్నోసార్లు ట్రోల్ చేశాడు. అలాగే ఫన్ పేరుతో అందరి మీద హద్దుమీరి కామెంట్స్ చేస్తుంటాడు. ఇటీవల ఒక చిన్నారిపై కూడా దారుణమైన కామెంట్స్ చేశాడు. అది నెటిజెన్ల ఆగ్రహం తెప్పించడమే కాకుండా.. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల వరకు చేరింది. ఇప్పటికే అతనిపై కేసు నమోదైంది.
ఈ మూడు సంఘటనలను ప్రభాస్ పేరుతో ముడిపెడుతూ కొందరు ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. "ఎవరి జోలికి పోని అలాంటి అమాయకుడి జోలికి పోతే సంకనాకిపోతారు" అంటూ కొన్ని మీమ్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
![]() |
![]() |