![]() |
![]() |

మంచు లక్ష్మి(manchu lakshmi)కలెక్షన్ కింగ్ మోహన్ బాబు (mohan babu)నట వారసురాలిగా సినీ రంగ ప్రవేశం చేసి విభిన్నమైన పాత్రలని పోషిస్తు తన దైన శైలిలో ముందుకు దూసుకుపోతుంది. అదే విధంగా సామిజిక సేవా పరంగాను తన తండ్రిని మరిపిస్తూ ముందుకు వెళ్తుంది. ఈ క్రమంలో ఒక న్యూస్ మంచు లక్ష్మి మానవతా దృక్పధానికి అద్దం పడుతుంది.
మంచు లక్షిఇటీవల యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణంలోని బగాయత్ ప్రాథమిక పాఠశాల ని సందర్శించింది. అక్కడ నూతనంగా ప్రవేశ పెట్టిన డిజిటల్ క్లాస్ రూమ్స్ ని ప్రారంభించింది. అవి స్వయంగా మంచు లక్ష్మి ఏర్పాటు చేసినవే. ఈ సందర్భంగా విద్యార్థులని ఉద్దేశించి మాట్లాడుతూ మీరే కాదు నాతో పాటు నా తండ్రి మోహన్ బాబు కూడా గవర్నమెంట్ స్కూల్ లోనే చదివినా వాళ్ళమే. మిమ్మల్ని చూసుకుంటే దేశాన్ని చూసుకున్నట్టే అనేది నా నమ్మకం . ఇక ముందు కూడా మీకు మరిన్ని సేవలు చేస్తాను . ప్రయివేట్ పిల్లలకి ,మీకు ఎలాంటి తేడా ఉండకూడదనేదే నా ధ్యేయం అని చెప్పుకొచ్చింది.
అదే విధంగా యాదాద్రి భువనగిరి జిల్లాల్లో తొమ్మిది వందల స్కూల్స్ ఉన్నాయి. ఇప్పటికి వరకు ఎనభై నాలుగు స్కూల్స్ వరకే మంచి చేయగలిగాను. మిగతా వాటిని కూడా స్థానిక నేతల సహాయంతో అభివృద్ధి చేస్తాను. అలాగే ఇండియా లో ఉన్న అన్ని గవర్నమెంట్ స్కూల్ పిల్లలు జీవితంలో ముందుకు వెళ్లాలనేది నా ధ్యేయం. ఇటీవల వనపర్తి లో, రామన్నపేట మండలంలోని ఒక స్కూల్ లో రెండు కంప్యూటర్ లాబ్స్ స్థాపించాను. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లోని వివిధ గవర్నమెంట్ స్కూల్స్ లో కూడా ప్రారంభిస్తానని చెప్పింది. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంఎల్ఏ అనిల్ రెడ్డి తో పాటు జిల్లా కలెక్టర్, వివిధ ఉన్నత శాఖాధికారులు పాల్గొన్నారు. వారందరు మంచు లక్ష్మి ని ఘనంగా సన్మానించారు.
![]() |
![]() |