![]() |
![]() |

ప్రభాస్ (Prabhas) అంటేనే రికార్డుల రారాజు అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. ఆయన సినిమా వస్తుందంటే.. ఉన్న రికార్డులు బ్రేక్ అవ్వడం, కొత్త రికార్డులు క్రియేట్ అవ్వడం కామన్ అయిపోయింది. ఇక ఇప్పుడు ప్రభాస్ తాజా చిత్రం 'కల్కి 2898 AD' (Kalki 2898 AD) విడుదలవుతున్న వేళ.. ఫస్ట్ డే కలెక్షన్స్ పరంగా ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది.
మొదటి రోజు వసూళ్ల పరంగా ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' టాప్ లో ఉంది. ఈ మూవీ ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా రూ.220 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. ఆ తరువాతి స్థానాల్లో.. రూ.215 కోట్లతో 'బాహుబలి-2', రూ.170 కోట్లతో 'సలార్', రూ.140 కోట్లతో 'ఆదిపురుష్', రూ.130 కోట్లతో 'సాహో' ఉన్నాయి. అంటే టాప్-5 లో నాలుగు సినిమాలు ప్రభాస్ వే ఉన్నాయన్నమాట. ఇక ఇప్పుడు 'కల్కి' చిత్రం టాప్-3 చోటు దక్కించుకోవడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇప్పటిదాకా మొదటి రోజు రూ.200 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టిన సినిమాలుగా 'బాహుబలి-2', 'ఆర్ఆర్ఆర్' నిలిచాయి. ఇప్పుడు వాటి సరసన 'కల్కి' చేరడం ఖాయమనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. సౌత్ ఇండియా, నార్త్ ఇండియా, ఓవర్సీస్ అనే తేడా లేకుండా అన్ని చోట్లా 'కల్కి' అడ్వాన్స్ బుకింగ్స్ కి ఓ రేంజ్ రెస్పాన్స్ వస్తుంది. ఈ బుకింగ్స్ ని చూస్తే, ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా రూ.200 కోట్ల గ్రాస్ మార్క్ అందుకోవడం ఖాయమని ట్రేడ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనికి తగ్గట్టు, ఇక ఈ సినిమాకి పాజిటివ్ టాక్ కూడా తోడైతే.. ఇదే ఊపులో 'బాహుబలి-2', 'ఆర్ఆర్ఆర్' రికార్డులను బ్రేక్ చేసి.. ఫస్ట్ డే గ్రాస్ పరంగా 'కల్కి' టాప్ లో నిలిచినా ఆశ్చర్యంలేదు అంటున్నారు.
![]() |
![]() |