![]() |
![]() |

ప్రస్తుతం ప్రపంచంలోని సినిమా ప్రేమికులంతా ‘కల్కి’ ఫీవర్‌తో ఉన్నారు. ఈ సినిమా కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసిన ‘కల్కి’ చిత్రం జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. ఎప్పటిలాగే భారీ చిత్రాలకు టికెట్ ధరలను పెంచుకునే వెసులుబాటును ఈ సినిమాకి కూడా కల్పించాయి ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సినిమా టికెట్ రేట్లను భారీగా పెంచారు. దేశంలోని పలు ప్రాంతాల్లో ‘కల్కి’ టికెట్ ధరలు వేలల్లో ఉన్నాయి.
మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలోనే టికెట్ ధరలు అందుబాటులో ఉన్నాయనిపిస్తుంది. ఇక మన పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో సైతం టికెట్ ధరలు పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీన్ని సవాలు చేస్తూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. రేపు ‘కల్కి’ చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో ఈరోజు మధ్యాహ్నం ఈ కేసును విచారణకు స్వీకరించనుంది కోర్టు.
![]() |
![]() |