![]() |
![]() |
.webp)
ఇండస్ట్రీకి కొత్త నటీనటులు వస్తూనే ఉన్నారు. అయితే వారికి సరైన హిట్ లభించిందా లేదా.. సరైన కథని ఎన్నుకున్నారా లేదా అనేది వారి మొదటి సినిమా ద్వారానే తెలుస్తోంది. అయితే తాజాగా ఓటీటీలోకి వచ్చిన రాధామాధవం మూవీలోని నటీనటులంతా కొత్తవాళ్ళే కావడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.
దర్శకుడు కొత్త ఆర్టిస్టుల నుంచి సరైన అవుట్ పుట్ తీసుకున్నాడా లేదా అనేది చూడాలి. పరువు హత్యల నేపథ్యంలో గతంలో చాలానే సినిమాలు వచ్చాయి. అలాంటి ఒక కంటెంట్ తో వచ్చిన సినిమానే 'రాధా మాధవం'. గోనాల వెంకటేశ్ నిర్మించిన ఈ సినిమాకి, దాసరి ఇసాక్ దర్శకత్వం వహించాడు. గ్రామీణ నేపథ్యంలో నడిచే ఈ సినిమా, ఈ నెల 20వ తేదీ నుంచి 'అమెజాన్ ప్రైమ్' లో స్ట్రీమింగ్ అవుతోంది.
అనంతపురం జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో జరుగుతుంది. ఆ గ్రామానికి చెందిన యువకుడు మాధవ్ ( వినాయక్ దేశాయ్) అదే గ్రామానికి చెందిన యువతి రాధ( అపర్ణాదేవి) ప్రేమించుకుంటారు. మాధవ్ తక్కువ కులానికి చెందినవాడైతే, రాధ అగ్రకులానికి చెందిన అమ్మాయి. చిన్నప్పటి నుంచి ఒకే స్కూల్లో చదువుతారు. ఆ తరువాత అతను ఉన్నత చదువుల కోసం పట్నం వెళ్లి వస్తాడు. అప్పటి నుంచే రాధతో ప్రేమాయణం మొదలవుతుంది. అయితే రాధ వాళ్ళ నాన్న వీరభద్రం రాజకీయాలలో ఎదగడానికి ఎంతకైనా తెగించాలనుకుంటాడు. అయితే తక్కువ కులానికి చెందిన మాధవ్ ని ఎన్నికల ముందు ఏదైనా చేస్తే అతని వర్గానికి చెందిన ఓట్లు పోతాయని వీరభధ్రం ఏమీ చేయడు. ఇక ఆ ఊరివాళ్ళంతా రాధా, మాధవ్ ల పెళ్ళి జరిపించడం కోసం వీరభద్రాన్ని గెలిపిస్తారు. కానీ ఓ రోజు రాత్రి రాధా, మాధవ్ లు ఊరు వదిలి వెళ్ళిపోతారు. మరి వీరభద్రం ఏం చేశాడు? రాధా, మాధవ్ ల పెళ్ళి జరిగిందా లేదా అనేది మిగతా కథ. ఓటీటీలో ఉన్న ఈ సినిమాని ఓ సారి ట్రై చేయండి.
![]() |
![]() |