![]() |
![]() |

కొన్ని సినిమాల కోసం ప్రేక్షకులే కాదు. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ కూడా ఎంతో ఆశగా ఎదురుచూస్తుంది.అలా ఆశగా ఎదురుచూసే సినిమాల్లో కమల్ హాసన్ (kamal haasan) ఇండియన్ 2(indian 2)కూడా ఒకటి. ఎప్పుడో షూటింగ్ కి పూర్తి చేసుకున్న ఈ మూవీ రక రకాల కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఆగే పని లేదని తాజా న్యూస్ ని బట్టి అర్ధం అవుతుంది. దీంతో కమల్ అభిమానుల్లో అండ్ సినీ ప్రియుల్లో జోష్ మొదలయ్యింది.
ఇండియన్ 2 జులై 12 న విడుదల కాబోతుంది. దీంతో చిత్ర బృందం ప్రమోషన్స్ ని స్టార్ట్ చేసింది. ఇందుకోసం ముంబైకి బయలుదేరింది. హీరో కమల్ తో పాటు దర్శకుడు శంకర్ (shankar)అండ్ మిగతా చిత్ర బృందం మొత్తం ప్రమోషన్స్ లో పాల్గొననుంది. ఈ మేరకు అధికార ప్రకటన కూడా వచ్చింది. సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ అవ్వడంతో కమల్ సరి కొత్త వాదనని తెరపైకి తెస్తున్నారు. కల్కి ఫీవర్ లో ఉన్న ఇండియా ఆ తర్వాత ఇండియన్ 2 ఫేవర్ తో ఉండటం ఖాయం అని అంటున్నారు. 1996 లో వచ్చి సంచలన విజయం సాధించిన భారతీయుడు కి సీక్వెల్ గా ఈ చిత్రం తెరకెక్కింది. కమల్ కెరీర్ లోనే అత్యంత భారీ వ్యయంతో లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుండగా బొమ్మరిల్లు సిద్దార్ధ్, రకుల్ ప్రీత్ సింగ్ , ప్రియా భవాని శంకర్, ఎస్ జె సూర్య, బాబీ సింహ తదితరులు ముఖ్య పాత్రలో కనిపిస్తున్నారు.
.webp)
ఇక కమల్ ఇప్పుడు కల్కి లో విలన్ గా చేస్తున్నాడు. ఆ మూవీ ప్రమోషన్స్ జరుగుతుండగానే ఇండియన్ 2 ప్రమోషన్స్ జరగుతుండంతో నేను హీరోనని చెప్తున్నట్టు అయ్యింది. ఇక ఇండియన్ 2 ప్రమోషన్స్ న్యూస్ రామ్ చరణ్(ram charan)కి అండ్ ఫ్యాన్స్ కి ఎనలేని ఆనందాన్ని తెస్తుందనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే చరణ్ గేమ్ చేంజర్ (game changer)ఇండియన్ వలనే లేట్ అవుతు వస్తుంది. గేమ్ చేంజర్ కి శంకర్ దర్శకుడు అనే విషయం అందరకి తెలిసిందే.
![]() |
![]() |