![]() |
![]() |
ఒకప్పుడు సినీ పరిశ్రమలోని ప్రముఖుల ఫ్యామిలీ గురించి ఎవరికీ తెలిసేది కాదు. వారి కుటుంబ సభ్యులు ఏ ఫంక్షన్‌లోగానీ, మీడియాలో గానీ కనిపించేవారు కాదు. కానీ, ఇటీవలికాలంలో సోషల్ మీడియా లీడ్‌లోకి వచ్చిన తర్వాత చాలా మంది ప్రముఖులు తమ ఫ్యామిలీ మెంబర్స్‌ని కూడా అందులో ఇన్‌వాల్వ్ చేస్తున్నారు. అలాగే వారి ఫ్యామిలీ మెంబర్స్ కూడా సోషల్ మీడియాలో హల్‌చల్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు అలాంటి ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఎన్నో సూపర్‌హిట్ సినిమాలను రూపొంచింది టాలీవుడ్‌లో టాప్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న సుకుమార్ ‘పుష్ప’ చిత్రంతో పాన్ ఇండియా డైరెక్టర్‌గా క్రేజ్ తెచ్చుకున్నారు. ఇప్పుడు ‘పుష్ప2’ చిత్రాన్ని ఎంతో ప్రెస్టీజియస్‌గా రూపొందిస్తున్నారు సుకుమార్. ఈ సినిమా ఈ ఏడాది చివరల్లో రిలీజ్ కాబోతోంది. ఈమధ్య సుకుమార్ కుమార్తె సుకృతికి సంబంధించి ఏదో ఒక న్యూస్ సోషల్ మీడియాలో దర్శనమిస్తోంది. సుకృతి ఓ షార్ట్ ఫిలింలో నటించి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గెలుచుకున్న విషయం తెలిసిందే. త్వరలోనే ఆమె టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తుందని ఊహాగానాలు చేస్తున్నారు. ఇప్పుడు మరోసారి సుకృతి వార్తల్లోకి ఎక్కింది. ఆమెకు సినిమాలపైన, ఫ్యాషన్ రంగంపైన ఆసక్తి ఉన్నట్టు కనిపిస్తోంది. తాజాగా ఓ ఫ్యాషన్ షోలో మోడ్రన్ డ్రెస్‌లో ర్యాంప్ వాక్ చేసి అందర్నీ ఆశ్చర్యపరచింది. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. మొదటిసారి మోడల్‌గా ఈ ఫ్యాషన్ షోలో పాల్గొనడం గర్వంగా ఉందని చెబుతోంది సుకృతి.
![]() |
![]() |