![]() |
![]() |

దీపికా పదుకునే..( deepika padukone)కల్కి (kalki 2898 ad)పుణ్యమా అని ఇప్పుడు ఈ పేరు పాన్ ఇండియా లెవల్లో మారుమోగిపోతుంది. అఫ్ కోర్స్ ఇప్పటికే తిరుగులేని స్టార్ హీరోయిన్. కాకపోతే కల్కి తో ఇంకాస్త హోదా పెరిగింది. దీంతో చాలామంది దీపికా గురించి గూగుల్ లో సెర్చ్ చేస్తున్నారు. అలా సెర్చ్ చేసిన వాళ్ళు ఆమె జర్నీని చూసి ఆశ్చర్య పోతున్నారు.
దీపికా పదుకునే ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ప్రకాష్ పదుకునే కుమార్తె. దీపికా ని మంచి క్రీడాకారిణిగా చెయ్యాలని ప్రకాష్ అనుకున్నాడు. అందుకు తగ్గట్టే బ్యాడ్మింటన్, బేస్ బాల్ లో దీపికా అత్యంత ప్రతిభ కనపర్చింది. అనేక ఛాంపియన్ షిప్ పోటీల్లో కూడా పాల్గొంది. దీంతో దీపికా క్రీడాకారిణిగా సెటిల్ అవుతుందని భావించారు. కానీ ఆ తర్వాత కంప్లీట్ గా మోడల్ రంగం వైపు వెళ్లిపోయింది. ఆ సమయంలో కింగ్ ఫిషర్ కంపెనీ కి బికినీ ధరించి ఫోజు ఇచ్చింది. అప్పట్లో ఆ విషయం పెద్ద హాట్ టాపిక్ గా మారింది. 2006 లో కన్నడ నాట ఉపేంద్ర హీరోగా తెరకెక్కిన ఐశ్వర్యఅనే మూవీతో హీరోయిన్ గా అడుగుపెట్టింది. తెలుగులో నాగార్జున హీరోగా వచ్చిన మన్మధుడు కి రీమేక్ గా ఆ చిత్రం తెరకెక్కింది.
ఇక ఆ తర్వాత షారుక్ హీరోగా చేసిన ఓం శాంతి ఓం తో బాలీవుడ్ లో అడుగుపెట్టింది. అందులో రెండు విభిన్నమైన పాత్రలు పోషించి వరుస అవకాశాలతో టాప్ హీరోయిన్ రేంజ్ కి వెళ్ళింది. చెన్నై ఎక్స్ ప్రెస్, బాజీరావు మస్తానీ, హ్యాపీ న్యూ ఇయర్, పఠాన్ , పద్మావతి, చపాక్, కొచ్చిదియాన్, ఇక ఎన్నో హిట్ సినిమాల ద్వారా తన సత్తా చాటింది. ఇప్పుడు ఇండియన్ మోస్ట్ ప్రేస్టీజియస్ట్ మూవీ కల్కి ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇటీవల ముంబై లో జరిగిన కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అద్భుతంగా మాట్లాడి అందరి మనసులని దోచుకుంది. ఇక నటనకి సంబంధించి ఎన్నో అవార్డుల్ని అందుకుంది . 2022 లో వరల్డ్ లోనే పది మంది అందమైన మహిళల్లో ఒకటిగా కూడా నిలిచింది. సూపర్ స్టార్ మహేష్ బాబు(mahesh babu)ని అభిమానించే దీపికా 2018 లో రణవీర్ సింగ్ ని పెళ్లి చేసుకుంది. మహారాష్ట్ర లోని ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని సామాజిక సేవ కూడా చేస్తు పలువురు నుండి ప్రశంసలు అందుకుంటుంది.
![]() |
![]() |