![]() |
![]() |
ఇటీవల జరిగిన ఎన్నికలు, తమ అభ్యర్థుల్ని గెలిపించుకునేందుకు సినీరంగానికి చెందిన వారు మద్దతు తెలియజేయడం చూశాం. ఆ క్రమంలోనే పిఠాపురం నుంచి పోటీ చేసిన పవన్‌కళ్యాణ్‌కు మెగా ఫ్యామిలీలోని చాలా మంది మద్దతు తెలిపారు. అల్లు అర్జున్ మాత్రం వైసీపికి చెందిన అభ్యర్థిని సపోర్ట్ చెయ్యడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. మెగా ఫ్యామిలీ వార్‌కి శ్రీకారం చుట్టింది. దీనివల్ల మెగా ఫ్యామిలీలో చీలిక వచ్చిందన్న వార్త ప్రచారంలోకి వచ్చింది. దానికి తగ్గట్టుగానే అల్లు అర్జున్ తీరు కూడా ఉండడంతో మెగా ఫ్యామిలీలో ఏం జరుగుతోందనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.
ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే త్వరలోనే మెగా వార్‌కు తెరపడే అవకాశం కనిపిస్తుంది. సోమవారం ఉదయం అల్లు అరవింద్ స్పెషల్ ఫ్లైట్‌లో విజయవాడ చేరుకున్నారు. ఆయనతోపాటు చలసాని అశ్వినీ దత్, అల్లు అరవింద్, ఎర్నేని నవీన్, దగ్గుబాటి సురేష్ బాబు, టీజీ విశ్వప్రసాద్, సుప్రియ యార్లగడ్డ, కనుమూరి రఘురామకృష్ణంరాజు ఉన్నారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఉప ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీసులో పవన్‌కళ్యాణ్‌తో భేటీ కానున్నారు నిర్మాతలు. సాధారణంగా టీవీ ఛానల్స్ కోరితే మాట్లాడేందుకు సిద్ధపడే అల్లు అరవింద్ గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో మీడియా ఆయనతో మాట్లాడిరచేందుకు ప్రయత్నించింది. కానీ, అందరికీ నమస్కారం పెడుతూ మౌనంగా ఉండిపోయారు తప్ప మాట్లాడలేదు. పవన్‌కళ్యాణ్‌తో జరిగే భేటీ తర్వాత మెగా ఫ్యామిలీకి, అల్లు ఫ్యామిలీకి మధ్య ఉన్న మనస్పర్థలు తొలగిపోతాయని అందరూ భావిస్తున్నారు.
![]() |
![]() |