![]() |
![]() |
.webp)
సినిమాల్లోనే కాదు సోషల్ మీడియాలోను ఒక్కొక్కళ్లకి ఒక్కో టైం వస్తుంది. ఇప్పుడు ఆ టైం పవన్ సన్ అకిరా నందన్(akira nandan)కి వచ్చింది. పవన్ (pawan kalyan) ఎన్నికల్లో గెలిచిన దగ్గరనుంచి అకిరా సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రెండ్ అవుతు వస్తున్నాడు. తన తండ్రి తో కలిసి ఏపి సిఎం చంద్రబాబునాయుడు(chandrababu naidu)ని కలవడం, ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ (narendra modi)ని కలవడంతో బాగా వైరల్ అవుతున్నాడు. పైగా మీ వాడేంటి ఇంత హైట్ ఉన్నాడని మోడీ అనడంతో పవన్ ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు.ఇక రేణు దేశాయ్ (rendu desai)ఆనందాన్ని అయితే మాటల్లో చెప్పలేం. సోషల్ మీడియాలో అందుకు సంబంధించిన పిక్స్ షేర్ చేస్తు ఎమోషనల్ గా కూడా ఫీలయ్యింది. అలాంటి రేణు తాజాగా ఒక వ్యకి మీద తన ఉగ్ర రూపాన్ని చూపిస్తుంది.
సోషల్ మీడియాలో రేణు ని ఫాలో అయ్యే ఒక వ్యక్తి అకిరా గురించి నెగిటివ్ గా కామెంట్స్ చేసాడు. అకిరా ఫేస్ నటించడానికి వర్తేనా అంటు కామెంట్స్ చేసాడు. వర్త్ అంటే విలువైనదేనా అని అర్ధం. అంటే అకిరా పేస్ నటించడానికి విలువైనదేనా అని అడిగాడు. దాంతో నీ అమ్మ నిన్ను ఇలానే పెంచిందా, ఓ పిల్లవాడు తన కెరీర్ ని ప్రారంభించక ముందే ఇలా మాట్లాడాతావా. కెరీర్ ని ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసేందుకు బయటకు వచ్చిన వాడి మీద ఇంత నెగెటివ్ ఎందుకు, అసలు నువ్వు వాడే పదాలకు అర్థం తెలుసా, నీకు ఇంగ్లీష్ కూడా సరిగా వచ్చినట్టు లేదు, అకిరా ఫేస్ వర్తా అని అడుగుతున్నావ్, నీకు నచ్చకపోతే చూడకు,సిగ్గు లేకుండా నా అకౌంట్‌ను ఫాలో అవుతూ, నా కొడుకు మీద నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నావు, అసలు నీలాంటి వాళ్లను చూస్తుంటే నాకు సిగ్గేస్తుంటుంది.. నీ లాంటి వాడ్ని పెంచిన వాళ్లను తలుచుకుంటే కూడా అలానే అనిపిస్తుందనే తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

అదే విధంగా ఈ మాటలన్నీ నేను అందరినీ ఉద్దేశించి అనడం లేదు. నన్ను ఫాలో అయ్యి నా బిడ్డ మీద కామెంట్ చేసే వాళ్లనే తిడుతున్నాను.అలాంటి వాళ్లందరికీ దేవుడే కాస్త బుద్ది ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను. నా గురించి ఎలాంటి చెత్త వాగుడు వాగినా భరిస్తాను కానీ నా పిల్లల మీద నెగెటివ్ కామెంట్లు, ద్వేషాన్ని, విషాన్ని చిమ్మితే మాత్రం ఊరుకోను. ఒక తల్లితో పెట్టుకుంటున్నారు. నేను నెగిటివ్ గా మాట్లాడే వాళ్ళని అంతం చేస్తానని చెప్తుంది. ఇప్పుడు రేణు దేశాయ్ చెప్పిన ఈ మాటలు వైరల్ గా మారాయి. ఇక కొన్ని రోజుల క్రితం పవన్ ని వదిలి తప్పు చేసారని రేణు కి పవన్ ఫ్యాన్స్ మెసేజ్ చేసారు. నేను మీ పవన్ ని వదల్లేదు, ఆయనే నన్ను వదిలేసాడు అని చెప్పింది. కొని రోజుల క్రితం అకిరా టాలెంట్ గురించి అందరికీ చూపిస్తూ అతని సోషల్ మీడియా అకౌంట్స్ ని రేణు వెల్లడి చేసింది.
![]() |
![]() |