![]() |
![]() |
పాన్ ఇండియా హీరో ప్రభాస్ రికార్డుల పరంపర మొదలైంది. నాగ్‌అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ నిర్మిస్తున్న ‘కల్కి 2898ఎడి’ చిత్రం జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఓవర్సీస్‌లో ఓ కొత్త రికార్డును క్రియేట్ చేసింది. యు.కె.లోని 400కు పైగా లొకేషన్స్‌లో తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో రిలీజ్ కాబోతోంది. ఒక ఇండియన్ మూవీ యు.కె.లో అత్యధిక లొకేషన్స్‌లో విడుదల కావడం ఆల్‌టైమ్ రికార్డ్‌గా చెప్పుకోవచ్చు.
‘కల్కి’పై భారీ అంచనాలు ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ఆ అంచనాలను రెట్టింపు చేసింది. అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే థ్రిల్లింగ్ అంశాలు ఈ చిత్రంలో ఉండడంతో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను 12 సంవత్సరాల పిల్లలు కూడా నిరంభ్యతరంగా చూడవచ్చు అని మేకర్స్ ప్రకటించడం విశేషం.
![]() |
![]() |