![]() |
![]() |

ఒక తల్లి తన బిడ్డని ఒడిలో కుర్చోబెట్టుకొని గోరు ముద్దలు తినిపిస్తుంది. నేను తిననని పిల్లాడు మారాం చేస్తున్నాడు. అప్పుడు తల్లి ఒక కథ చెప్పటం స్టార్ట్ చేస్తుంది.ఆ కథల్లో ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు ఉంటున్నాడు. అంతలా తన సినిమాల ద్వారా సామాజిక సేవ ద్వారా మహేష్ పేరు సంపాదించాడు. ఇందుకు నిదర్శనంగా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. తాజాగా మరో ఉదాహరణ వాటి సరసన స్థానాన్ని దక్కించుకుంది
కాకర్లమూడి రాజేష్.. కృష్ణా జిల్లా మోపిదేవి మండలంలోని ప్రశాంత్ నగర్ అతని ఊరు. మొదటి నుంచి కృష్ణ గారి అభిమాని. కృష్ణ నటించిన సినిమాలన్నింటిని ఒకటికి పది సార్లు చూసే వాడు. రిక్షా నడుపుకుంటూ జీవించే రాజేష్ వచ్చిన డబ్బుల్లో సగం డబ్బులని కృష్ణ సినిమాలు చూడటానికే ఖర్చు చేసేవాడు. ఆ తర్వాత మహేష్ బాబు ని అభిమానించడం స్టార్ట్ చేసాడు. క్రమంగా వీరాభిమానిగా మారాడు. ఇప్పుడు రాజేష్ చావు బతుకుల మధ్య ఉన్నాడు. కిడ్నీ ఫెయిల్ అవ్వడంతో ఆ సమస్య వచ్చింది.దీంతో పెద్ద కొడుకు అర్జున్ ఒక చెప్పుల షాపులో పని చేస్తున్నాడు. ఈ విషయాలన్నీ మహేష్ బాబు కి తెలియడంతో మహేష్ టీం రంగంలోకి దిగింది. పిల్లలని సమీపంలో ఉన్న ఒక పైవేట్ స్కూల్ లో చేర్పించారు. అంతే కాకుండా వాళ్ళ పుస్తకాలు, బట్టలు, తిండి మొత్తం కూడా మహేష్ బాబు నే చూసుకోనున్నాడు. అంటే తన అభిమానుల పిల్లల్ని మహేష్ దత్తతు తీసుకున్నాడన్న మాట. ఇక చనిపోయే లోపు మహేష్ ని కలవాలనే రాజేష్ కోరిక కూడా నెరవేరే అవకాశం ఉంది. అదే విధంగా హెల్త్ కి సంబంధించిన ట్రీట్ మెంట్ కూడా ఇప్పిస్తారని మహేష్ టీం చెప్తుంది. గతంలో మహేష్ చాలా హార్ట్ ఆపరేషన్స్ చేయించిన విషయం తెలిసిందే
ఇక రాజేష్ కి మహెష్ అంటే ఎంత అభిమానం అంటే మొదటి కొడుకు పుట్టినపుడు మహేష్ నటించిన అర్జున్ మూవీ రిలీజ్ అయింది. దాంతో మొదటి కొడుక్కి అర్జున్ అని పేరు పెట్టాడు. రెండో కొడుకు పుట్టినప్పుడు అతిధి రిలీజ్ అయ్యింది. అంతే అతిధి అని పేరు పెట్టాడు.ఇక మూడో కొడుకు పుట్టినపుడు ఆగడు రిలీజ్ అయ్యింది. ఆ పేరు బాగోదని చాలా మంది మొత్తుకున్నా కూడా ఆగడు నే ఫిక్స్ చేసాడు. ఆయా పేర్లు మీద గవర్నమెంట్ నుంచి అధికారకంగా ఆధార్ కూడా వచ్చింది.
![]() |
![]() |