![]() |
![]() |

తన 15వ సినిమా 'గేమ్ ఛేంజర్' (Game Changer)ని శంకర్ దర్శకత్వంలో చేస్తున్న రామ్ చరణ్ (Ram Charan).. 16వ సినిమాని 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు డైరెక్షన్ లో చేయనున్న సంగతి తెలిసిందే. వృద్ధి సినిమాస్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ కాగా, శివ రాజ్‌కుమార్ కీలక పాత్రలో నటించనున్నారు. సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లే అవకాశముంది.
స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కనున్న 'RC 16' కోసం రామ్ చరణ్ ప్రత్యేకంగా మేకోవర్ కాబోతున్నట్లు తెలుస్తోంది. క్యారెక్టరైజేషన్ తో పాటు, లుక్స్ పరంగా కూడా.. ఇప్పటిదాకా చరణ్ చేసిన పాత్రలకు పూర్తి భిన్నంగా ఇందులో ఆయన పాత్ర ఉంటుందట. అందుకే, ఆ పాత్రకు తగ్గట్టుగా ట్రాన్స్ఫర్మేషన్ కోసం చరణ్ ఆస్ట్రేలియా వెళ్తున్నట్టు సమాచారం. రెండు నెలల పాటు అక్కడే ఉండి.. స్పెషల్ ట్రైనర్స్ సమక్షంలో పాత్రకి తగ్గట్టుగా తన బాడీని, లుక్స్ మార్చుబోతున్నాడట. మొత్తానికి 'RC 16' కోసం ఓ సరికొత్త మేకోవర్ తో చరణ్ కనిపించనున్నాడని అంటున్నారు.
![]() |
![]() |