![]() |
![]() |
.webp)
తెలుగు, హిందీ, మలయాళం, తమిళం భాషల్లో తీసిన కొన్ని సినిమాలు థియేటర్లలో రిలీజై భారీ హిట్ గా నిలుస్తున్నాయి. అయితే వాటిని ఓటీటీలోకి తీసుకురావడానికి మేకర్స్ ఎక్కువ సమయం తీసుకోవడం లేదు. నెల గడవకముందే ఓటీటీలోకి తెచ్చేస్తున్నారు. అయితే హారర్ సినిమాలకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ సినిమాలు ఏ ఓటీటీలో ఉన్నాయో వెతుక్కుని మరీ చూసే అభిమానులున్నారు.
ఈ నెలలో చాలానే సినిమాలు థియేటర్లలో, ఓటీటీలో సందడి చేశాయి. వాటిల్లో కొన్ని డిసాస్టర్ అవ్వగా మరికొన్ని హిట్ అయ్యాయి. జూన్ 7 న థియేటర్లలో విడుదలైన మూవీ 'ముంజా'. మోనా సింగ్, శార్వరి, అభయ్ వర్మ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ... పెద్ద సినిమాలని కూడా వెనక్కి నెట్టి థియేటర్లలో కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ 55 కోట్లకి పైగా వసుళ్ళని రాబట్టింది. మ్యాడ్ మ్యాక్ సూపర్ నేచురల్ యూనివర్స్ లో ఇప్పటివరకు స్త్రీ, రూహి, భేడియా సినిమాలు రాగా ముంజా నాల్గవది. ఆదిత్య సర్పోడర్ దర్శకత్వం వహించిన ఈ మూవీని చిన్నాపెద్ద తేడాలేకుండా అందరు చూసేస్తున్నారు. అయితే ఈ సినిమా డిజిటల్ రైట్స్ కి ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.
మిస్టర్ అండ్ మిసెస్ మహి, చందూ చాంపియన్ వంటి సినిమాలు థియేటర్లలో ఉన్నప్పటికి ముంజా మూవీ అత్యధిక వసూళ్ళను రాబట్టుతోంది. అయితే ఈ సినిమాని జూలై నెలలో ఓటీటీలోకి రాబోతుందని తెలుస్తోంది. అయితే అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. హిందీలో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ సూపర్ హిట్ హారర్ మూవీని ఇతర భాషల్లోకి అనువదిస్తారో లేదో చూడాలి మరి.
![]() |
![]() |