![]() |
![]() |

నిలువవే వాలు కనుల దాన వయ్యారి హంస నడక దాన అని ప్రియుడు తన ప్రేయసి ని ఉద్దేశించి పాడాడంటే ఖచ్చితంగా ఆమె కురులు కూడా అందుకు ఒక కారణం. అందుకు తగ్గట్టే ఆడవారు కూడా తమ కురులకి అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. కానీ ఒక హీరోయిన్ దైవం ముందు నేనెంత అని తన కురులని త్యాగం చేసింది.
శరణ్య నాగ్ (saranya nag)1998 లో ప్రశాంత్, ఇషా కొప్పికర్ హీరో హీరోయిన్లుగా తమిళంలో తెరకెక్కిన కాదల్ కవితాయ్ చిత్రం ద్వారా బాల నటిగా సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత సోలో హీరోయిన్ గా ఎన్నో హిట్ సినిమాల్లో చేసింది. వాటిల్లో ఒక హిట్ సినిమా 10th క్లాస్. 2006 లో వచ్చిన ఆ మూవీ తెలుగులో కూడా రిలీజ్ అయ్యి ఘన విజయాన్ని సాధించింది. అంజలి క్యారక్టర్ లో శరణ్య ప్రదర్శించిన పెర్ ఫార్మెన్స్ కి యూత్ మొత్తం ఫిదా అయ్యింది. చాలా మంది శరణ్య ఫోటోని తమ పర్సుల్లో కూడా ఉంచుకున్నారంటే ఆమె ప్రభావాన్ని అర్ధం చేసుకోవచ్చు. లేటెస్ట్ గా శరణ్య తమిళనాడు లో పేరెన్నిక గన్న తిరుత్తణి సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకొని స్వామివారికి తలనీలాలు సమర్పించింది. అంతటితో ఆగకుండా నాలుకపై శూలాన్ని కూడా పొడిపించుకుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో అందుకు సంబంధించిన పిక్స్ వైరల్ గా మారాయి. కొంత మంది అయితే శరణ్యని అసలు గుర్తుపట్టలేదు. ఆ తర్వాత విషయం తెలుసుకొని శరణ్య భక్తి ని మెచ్చుకుంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

ఇక శరణ్య కి తిరుత్తణి సుబ్రమణ్య స్వామి అంటే చాలా భక్తి. తన కోరికలని స్వామి నెరవేర్చినందుకే మొక్కులు చెల్లించింది. 10 th క్లాస్ తర్వాత తెలుగులో ప్రేమ ఒక మైకం, దూసుకెళ్తా చిత్రాల్లో చేసింది. 2013 లో అవి ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.ఇక సోలో హీరోయిన్ గా ఆమె చివరి చిత్రం తమిళంలో తెరకెక్కిన ఈరా వెయ్యిల్.. 2014 లో ఆ మూవీ వచ్చింది. తెలుగు హీరో ఆర్యన్ రాజేష్ హీరో.
![]() |
![]() |