![]() |
![]() |

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో నిఖిల్ ఇటీవలే తండ్రిగా ప్రమోషన్ పొందిన విషయం తెలిసిందే. అతని భార్య పల్లవి ఈ ఏడాది ఫిబ్రవరిలో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని నిఖిల్ సోషల్ మీడియా వేదికగా తన అభిమానులకు తెలియజేశాడు. దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు నిఖిల్- పల్లవి దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. నిఖిల్ తనయుడి బారసాల ఫొటోలు కూడా లీక్ అయ్యాయి.

కానీ నిఖిల్ తన కొడుకుకి ఏ పేరు పెట్టాడు అనేది మాత్రం చెప్పలేదు. కాగా హీరో వరుణ్ సందేశ్ ప్రస్తుతం ‘నింద’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ది ఫెర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజేష్ జగన్నాధం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 21న విడుదల కానుంది. ఇటీవలే జరిగిన ‘నింద’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హీరో నిఖిల్ వచ్చాడు. ఈ సందర్బంగా మాట్లాడుతూ... చిత్రం ఘన విజయం సాధించాలంటూ మూవీ టీమ్‌కి శుభాకాంక్షలు తెలిపాడు. అంతే కాకుండా ఇదే ఈవెంట్‌లో తన కొడుకు పేరు ‘ధీర సిద్దార్ద’ అంటూ తన కొడుకు పేరును ప్రకటించాడు నిఖిల్. ప్రస్తుతం నిఖిల్ ‘స్వయంభూ’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి.
![]() |
![]() |