![]() |
![]() |
.webp)
అచ్చ తెలుగు అమ్మాయి, అచ్చ తెలుగు నటి అంజలి(anjali).2013 లో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుతో ఫేమ్ అయ్యింది. కానీ అంతకంటే ముందే తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో సుమారు పద్నాలుగు సినిమాల దాకా చేసింది. ఆమె సినీ జర్నీ ఏ పాటిదో చెప్పటానికి ఆ అంకెలే నిదర్శనం. తాజాగా ఆమెకి సంబంధించిన ఒక మూవీ పోస్టర్ పలువురిని ఆకర్షిస్తుంది.
అంజలి ఇటీవలే విశ్వక్ సేన్ గ్యాంగ్ ఆఫ్ గోదావరి లో ఒక కీలక పాత్ర పోషించి తన యాక్టింగ్ కి ఉన్న పవర్ ని మరోమారు చాటి చెప్పింది. చరణ్ (ram charan)అప్ కమింగ్ మూవీ గేమ్ చేంజర్(game changer)లోను చేస్తుంది. డ్యూయల్ రోల్ పోషిస్తున్న చరణ్ కి ఒక జోడి అనే టాక్ కూడా ఉంది.స్యయంగా అంజలి నే గేమ్ చేంజర్ లో నేను కూడా ఒక హీరోయిన్ అని చెప్పింది కూడా. ఇప్పుడు ఓటిటి వేదికగా కూడా తన సత్తా చాటడానికి సిద్ధం అవుతుంది. బహిష్కరణ (bahishkarana)అనే పేరుతో ఒక వెబ్ సిరీస్ తెరకెక్కుతుంది అంజలి పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ ఒక పోస్టర్ ని రిలీజ్ చేసారు. ఇప్పుడు ఈ పోస్టర్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.

ఒక కుర్చీ తగలబడుతు ఉంది. పక్కనే కింద కూర్చొని ఉన్న అంజలి చేతిలో కొడవలి పట్టుకొని రౌద్రంతో బిగ్గరగా అరుస్తుంది. ఇప్పుడు ఈ పోస్టర్ తో సిరీస్ మీద అందరిలోను అంచనాలు పెరిగాయి. ఒక పల్లెటూరి అమ్మాయి తన ఊరి సర్పంచ్, అతని అనుచరులు వల్ల ఎలాంటి అవమానాలు ఎదుర్కొంది అనే పాయింట్ తో సిరీస్ తెరకెక్కింది.ముకేశ్ ప్రజాపతి దర్శకుడు కాగా ప్రశాంతి మలిశెట్టి నిర్మాత. అతి త్వరలోనే జీ 5 లో టెలికాస్ట్ కానుంది.అంజలి తో పాటు వకీల్ సాబ్ ఫేమ్ అనన్య నాగళ్ళ, శ్రీ తేజ్, రవీంద్ర విజయ్ తదితరులు ముఖ్య పాత్రల్లో మెరుస్తున్నారు.
![]() |
![]() |