![]() |
![]() |

ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీ రావు (ramoji rao) గారి మరణంపై భారతదేశ వ్యాప్తంగా ఉన్న పలువురు సినీ రాజకీయ దిగ్గజాలు తమ సానుభూతిని తెలియచేస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ ,రామ్ చరణ్ లాంటి స్టార్స్ తమ సంతాపాన్ని తెలియచేసారు. రీసెంట్ గా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth)కూడా తన సంతాపాన్ని తెలియచేస్తు రామోజీ రావు గారితో ఉన్న తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు.
రామోజీరావు గారి మరణం నన్ను చాలా తీవ్రంగా కలిచివేసింది. ఎందుకంటే ఆయన నా వెల్ విషర్, .నా గైడ్, నా ఇన్స్పిరేషన్.నా లైఫ్ ఇలా సాగుతుందంటే ఆయనే కారణం. జర్నలిజంలో ఒక చరిత్ర సృష్టించారు .సినిమాల్లోను, రాజకీయాల్లోను కింగ్ మేకర్ గా నిలిచారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలి అంటూ ట్వీట్ చేసాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో రజనీ ట్వీట్ వైరల్ గా మారింది
ఇందుకు కారణం కూడా లేకపోలేదు. చాలా మందికి రజనీకాంత్ కి, రామోజీ రావు గారికి మధ్య ఉన్న అనుబంధం గురించి పెద్దగా తెలియదు. దీంతో రజనీ వంటి వ్యక్తి రామోజీ రావు గారే తన మెంటర్ అని చెప్పడంతో రామోజీ రావు గారి గొప్పతనాన్ని అందరు కొనియాడుతున్నారు. రామోజీ గారి పార్ధీక దేహాన్ని దర్శించుకోవడానికి రజనీ హైదరాబాద్ బయలుదేరాడనే వార్తలు వినపడుతున్నాయి.
![]() |
![]() |