![]() |
![]() |

ఉదయించే సూర్య కిరణాల్నిచూసి అవే కదా ఉషాకిరణాలు అని ప్రతి ఒక్కడు అనుకునేలా చేసిన ఎవరెస్ట్ శిఖరాదిపతి రామోజీరావు. అందరకి అమ్మ అక్షరాన్ని దిద్దిస్తే ఆ అక్షరానికి పదును పెట్టింది మాత్రం రామోజీరావు (ramoji rao)గారే. ఈ మాట అక్షర సత్యం అని ఈనాడు పేపర్ ప్రేమికులు చెప్తారు. ప్రజలకి ఆర్ధిక క్రమశిక్షణ కూడా నేర్పింది కూడా ఆయనే. మాటలు కాదు రామోజీ రావు గారిలా చేతల్లో చూపించు అని కూడా అంటారు. ఆ మౌన ముని చక్రవర్తి ఈ రోజు తుది శ్వాస విడిచారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి(tweet)ఒక ట్వీట్ చేసారు
రామోజీ రావు గారు ఎవరకి తల వంచని మేరు పర్వతం. ఆయన ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను అంటూ చిరంజీవి ట్వీట్ చేసాడు. చిరు చెప్పినట్టే రామోజీ రావు గారు తన జీవితం మొత్తం మీద ఎవరకి తలవంచకుండా అందరు తల ఎత్తి చూసే స్థాయికి ఎదిగారు. స్థాయి అనే కంటే ఒక సామ్రాజ్యాన్ని సృష్టించారని చెప్పవచ్చు. ఇక చిరు కి రామోజీ కి మధ్య ఎన్నో సంవత్సరాల అనుబంధం ఉంది. ఈ విషయాన్ని చాలా సందర్భాల్లో చిరునే స్వయంగా చెప్పాడు. చిరు కి సంబంధించిన ఎన్నో సినిమాలు ఫిలిం సిటీ లో షూటింగ్ చేసుకున్నాయి.అదే విధంగా రామోజీ రావు గారి కుటుంబంలో జరిగే అన్ని శుభకార్యాలకి చిరు హాజరవుతాడు. అలాగే ఈటీవీ వార్షికోత్సవాలకి ముఖ్య అతిధిగా కూడా హరాజయ్యాడు.
![]() |
![]() |