![]() |
![]() |

యాంకర్ శ్యామల( Anchor Shyamala) ఇప్పుడు ఈ పేరు రెండు తెలుగు రాష్టాల్లో మారుమోగిపోతుంది. గత నెలలో జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఆమె వైసీపీ తరుపున ప్రచారం చేసింది. ఆ పార్టీ గెలుపుని కోరుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా విసృతంగా తిరిగింది. ఆ సందర్భంలో ఉమ్మడి గా పోటీ చేసిన చంద్రబాబు, పవన్ ల పై పరుషమైన వ్యాఖ్యలు చేసింది. ఆ మాటలు సంచలనం సృష్టించాయి కూడా. ఎక్స్ క్లూసివ్ గా మరికొన్ని వ్యాఖ్యలు చేసింది. అవి కూడా సంచలనం సృష్టిస్తున్నాయి.
రీసెంట్ గా శ్యామల ఒక వీడియో రిలీజ్ చేసింది.అందులో ఆమె మాట్లాడుతు కూటమి విజయం సాధించినందుకు ధన్యవాదాలు. అలాగే పెద్దలు చంద్రబాబు గారికి, పవన్ గారికి, పురందేశ్వరి గారికి శుభాకాంక్షలు. వాళ్ళ ఆధ్వర్యంలో రాష్టం బాగుపడాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజల క్షేమమే ముఖ్యం. ఒక్కొక్కరికి ఒక్కో పార్టీ అంటే ఇష్టం. అలాగే నాకు వైసీపీ(ycp)అంటే ఇష్టం. అంత మాత్రాన నేను బతకకూడదని అనటం అన్యాయం. దయ చేసి ఏది కూడా వ్యక్తిగతంగా తీసుకోవద్దు .నేను వ్యక్తిగతంగా ఎవరి మీద విమర్శలు చెయ్యలేదు. ఎప్పటికి చెయ్యను కూడా. దయ చేసి మీరు ఏది పర్సనల్ గా తీసుకోవద్దు. ఒక పార్టీని గెలిపించే ప్రయత్నంలో చెయ్యాల్సిందంతా చేశాను అని చెప్పింది. అంతవరకు బాగానే ఉంది. కానీ చివరిలో మాత్రం నేను ఉన్నదే మాట్లాడాను. దయచేసి అర్ధం చేసుకుంటారని అనుకుంటున్నానని అంది. ఇప్పుడు ఈ మాటలని సోషల్ మీడియాలో చూసిన చాలా మంది చంద్రబాబు పవన్ ని ముసలి నక్క, గుంట నక్క అని అంది కదా. మరి అలా మాట్లాడుతుందేంటీ శ్యామల కి మతి స్థిమితం కోల్పోయిందేమో అని కామెంట్స్ చేస్తున్నారు.
అదే విధంగా వైసీపీ గెలుపుకోసం ప్రచారం చేసిన ప్రతి ఒక్క వైసీపీ కుటుంబ సభ్యుడికి దన్యవాదాలు తెలిపింది .గెలిచిన నాడు విజయ గర్వంతో విర్రవీగలేదు. ఓడిన నాడు నిరాశ చెందేది లేదు. జగనన్న మళ్ళీ మరింత పుంజుకొని అధికారంలోకి వస్తాడని కూడా తెలిపింది. ఎప్పటికి జగన్నన్న తోనే ఉంటానని చెప్పడంతో పాటుగా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. చాలా భయంగా ఉందని కూడా చెప్పింది.
![]() |
![]() |