![]() |
![]() |
.webp)
గతంలో తెలుగు సినిమాలలో పెద్ద హీరోలతో పాటు కొంతమంది చిన్న హీరోలు, చిన్న నటీనటులు కలిసి చేసిన సినిమాలు హిట్లుగా నిలిచాయి. అయితే వాటిల్లో కంటెంట్ డెప్త్ ని బట్టి అవి సక్సెస్ ని అందుకున్నాయి. అలాంటిదే ఈ నెల రెండో వారంలో ఓ సినిమా రిలీజ్ అవ్వనుంది.
వెన్నెల కిషోర్, షకలక శంకర్, నందిత శ్వేత, నవమి గాయక్, నవీన్ నేని ప్రధాన పాత్రలుగా నటించిన మూవీ ' ఓ మంచి గోస్ట్ '. ఈ మూవీ హారర్ కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కించారు. మార్క్ సెట్ నెట్ వర్క్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ మూవీని శంకర్ మార్తాండ్ డైరెక్ట్ చేశాడు. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్, లిరికల్ సాంగ్, టీజర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. వాటికి సోషల్ మీడియాలో మంచి స్పందన లభిస్తోంది.
తాజాగా ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ పోస్టర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ నెల 14 న థియేటర్లలో ' ఓ మంచి గోస్ట్ ' సందడి చేయనుంది. షకలక శంకర్, వెన్నెల కిషోర్, నవమి గాయక్, నవీన్ నేని, రజత్ రాఘవ్, రఘు బాబు, ప్రధాన పాత్రలు పోషించారు. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. ఎమ.ఆర్ వర్మ ఎడిటింగ్ అందించగా, డిఓపీగా ఆండ్రు చేశాడు.
![]() |
![]() |