![]() |
![]() |

బాలీవుడ్ ప్రముఖ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ (Kangana Ranaut) కు ఊహించని షాక్ తగిలింది. చండీగఢ్ విమానాశ్రయంలో సీఐఎస్ఎఫ్ మహిళా అధికారి కంగనాను చెంపదెబ్బ కొట్టింది. ఢిల్లీలో శుక్రవారం జరగనున్న ఎన్డీఏ ఎంపీల సమావేశంలో పాల్గొనేందుకు వెళ్తుండగా ఆమెకు ఈ చేదు అనుభవం ఎదురైంది.
కంగనా గతంలో రైతుల ఉద్యమానికి వ్యతిరేకంగా మాట్లాడింది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. చండీగఢ్ ఎయిర్‌పోర్టులో సెక్యూరిటీ విధులు నిర్వర్తిస్తున్న సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ కంగనాతో వాదనకు దిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆ మహిళా అధికారి చెంప దెబ్బ కొట్టినట్లు సమాచారం. కంగనాతో ఫిర్యాదుతో కుల్విందర్ కౌర్ అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారట.
![]() |
![]() |