![]() |
![]() |

ప్రస్తుతం తెలుగునాట పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పేరు మారుమోగిపోతోంది. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, బీజేపీతో కలిసి పవన్ నేతృత్వంలోని జనసేన పార్టీ ఎన్నికల బరిలోకి దిగగా.. 21 ఎమ్మెల్యే, 2 ఎంపీ సీట్లతో పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచి సంచలనం సంచలనం సృష్టించింది. మరోవైపు కేంద్రంలో ముచ్చటగా మూడోసారి మోడీ ప్రధాని కాబోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మోడీతో పవన్ కుటుంబం భేటీ అయింది.

ఎన్డీఏ కూటమి సమావేశం కోసం ఢిల్లీ వెళ్లిన పవన్ కళ్యాణ్.. మోడీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పవన్ వెంట ఆయన సతీమణి అన్నా లెజ్నెవా, కుమారుడు అకీరా నందన్ (Akira Nandan) ఉన్నారు. ఈ సందర్భంగా పవన్ తన కుమారుడిని పరిచయం చేయగా.. అకీరాను మోడీ ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని, భుజంపై చెయ్యి వేసి సరదాగా మాట్లాడారు. అకీరా ఎత్తు గురించో లేక మరేదైనా విషయమో కానీ.. అకీరాను పట్టుకొని మోడీ ఏదో అనగా.. ఆ మాటకు పవన్, అన్నా లెజ్నెవా గట్టిగా నవ్వేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

![]() |
![]() |