![]() |
![]() |

శర్వానంద్ (Sharwanand), కృతి శెట్టి (Krithi Shetty) జంటగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రూపొందిన సినిమా 'మనమే' (Manamey). పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ రొమాంటిక్ కామెడీ డ్రామా శుక్రవారం(జూన్ 7న) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ఆకట్టుకున్నాయి. 'ఒకే ఒక జీవితం' తర్వాత శర్వానంద్ నుంచి వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఓ షాకింగ్ న్యూస్ వినిపిస్తోంది. ఇదొక హాలీవుడ్ సినిమాకి కాపీ అనే ప్రచారం జరుగుతోంది.

2010లో 'లైఫ్ యాజ్ వి నో ఇట్' అనే హాలీవుడ్ ఫిల్మ్ విడుదలై మంచి విజయం సాధించింది. ఇదొక రొమాంటిక్ కామెడీ డ్రామా. ఇందులో ఒకరినొకరు ద్వేషించుకునే హీరో హీరోయిన్.. అనుకోకుండా ఒక చిన్న పాపకి గార్డియన్లుగా ఉండాల్సి వస్తుంది. అక్కడి నుంచి వారి ప్రయాణం ఎలా సాగింది, ఒక సంవత్సరం తిరిగొచ్చేసరికి వారు ఒకరికొకరు ఎలా దగ్గరయ్యారు అనేది ఆ సినిమా కథ. అయితే ఇప్పుడు 'మనమే' ఆ సినిమా స్ఫూర్తితోనే రాబోతుందని ఇండస్ట్రీలో వినిపిస్తున్నమాట. పైగా 'మనమే' ప్రచార చిత్రాలను గమనిస్తే.. 'లైఫ్ యాజ్ వి నో ఇట్' ఛాయలే కనిపిస్తున్నాయి. మరి 'మనమే'.. హాలీవుడ్ సినిమాకి నిజంగానే కాపీనా కాదా తెలియాలంటే.. మరికొద్ది గంటలు వేచి చూడాలి.
![]() |
![]() |