![]() |
![]() |

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధించి జగన్ పార్టీ చీకటి రోజులను పారద్రోలిన నేపథ్యంలో ‘తెలుగువన్’ కార్యాలయంలో విజయోత్సవం జరిగింది. సంస్థ కార్యాలయం ముందు భారీగా బాణాసంచాలను కాల్చారు. అనంతరం ‘తెలుగువన్’ అధినేత కంఠంనేని రవిశంకర్ సంస్థ కుటుంబ సభ్యుల సమక్షంలో కేక్ కట్ చేశారు.
ఈ సందర్భంగా రాజకీయ పరిశీలకుడు సువేరా మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌లో రాక్షస పాలన అంతమైందని అన్నారు. జగన్ అక్రమాలను ప్రజలకు తెలియజేసినందుకు తెలుగువన్ అధినేత కంఠంనేని రవిశంకర్‌ని టార్గెట్ చేసిన జగన్ ఇబ్బందులు పెట్టడానికి ప్రయత్నించాడని, కంఠంనేని రవిశంకర్‌ని అరెస్టు చేసే ప్రయత్నం కూడా చేశాడని చెప్పారు. రవిశంకర్ అదృష్టవశాత్తూ జగన్ హింసల నుంచి తప్పించుకున్నారని అన్నారు. అమరావతి విషయంలో కంఠంనేని రవిశంకర్ ‘అమరావతి ఫైల్స్’ అనే సినిమా తీస్తే, దాని పేరు ‘రాజధాని ఫైల్స్’ అని మార్చేలా జగన్ కుట్ర చేశాడని, ఆ సినిమా విడుదల సమయంలో కూడా ఎన్నో కుట్రలు చేశాడని వివరించారు. అయినప్పటికీ ‘రాజధాని ఫైల్స్’ సినిమా తెలుగుదేశం పార్టీ విజయానికి అంతర్లీనంగా తనవంతు బాధ్యత నిర్వర్తించిందని సువేరా చెప్పారు. జగన్ పాలన అంతం కావడంతో ఆంధ్రప్రదేశ్‌కి మంచి రోజులు వచ్చాయని ఆయన అన్నారు.
.webp)
‘తెలుగువన్’ అధినేత కంఠంనేని రవిశంకర్ మాట్లాడుతూ, ‘జగన్ దుర్మార్గ పాలనను వ్యతిరేకించినందుకు జగన్ ‘తెలుగువన్’ కార్యాలయం మీద పోలీసుల చేత దాడులు చేయించాడని, తెలుగువన్ సర్వర్లు పోలీసులు తీసుకెళ్ళారని, అవి ఇంతవరకు తిరిగి ఇవ్వలేదని చెప్పారు. జగన్ తనను ఎన్నో ఇబ్బందులు పెట్టినా ‘రాజధాని ఫైల్స్’ సినిమాని ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగానని చెప్పారు. చంద్రబాబు అరెస్టు సమయంలో హైదరాబాద్‌లో ఒక పెద్ద కార్యక్రమాన్ని యువతరం సహకారంతో నిర్వహించగలిగామని ఆయన చెప్పారు. చంద్రబాబును అరెస్టు చేసిన చంద్రబాబు, చంద్రబాబు అరెస్టు మీద వ్యాఖ్యలు చేసిన కేసీఆర్, కేటీఆర్ ప్రభుత్వం మట్టిలో కలిసిపోయాయని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు బయటకి హడావిడి చేయరు.. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని మరోసారి నిరూపించారని చెప్పారు.
.webp)
తాను ‘రాజధాని ఫైల్స్’ చిత్రాన్ని నిర్మించి, రామోజీరావు గారికి ఆ సినిమాని చూపించినప్పుడు ఆయన ‘ఇంత రిస్క్ ఎందుకు చేశారు’ అని అన్నారని, అప్పుడు తనకు ఏం చెప్పాలా అని ఆలోచిస్తున్న సమయంలో, తన పక్కనే వున్న తన భార్య హిమబిందు (తెలుగువన్ డైరెక్టర్) ఎవరో ఒకరు ముందుకు రాకపోతే జగన్ దుర్మార్గాలను ప్రశ్నించేది ఎవరు అని అనడాన్ని ఈ సందర్భంగా కంఠంనేని రవిశంకర్ గుర్తు చేసుకున్నారు. జగన్ పాలనకు వ్యతిరేకంగా తెలుగువన్ చేసిన పోరాటానికి అండగా నిలిచిన తెలుగువన్ కుటుంబానికి ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కి మంచి రోజులు వచ్చాయని ఆయన ఈ సందర్భంగా సంతోషాన్ని వ్యక్తం చేశారు.
.webp)
![]() |
![]() |