![]() |
![]() |
.webp)
2014 లో జరిగిన ఎన్నికల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోయాడు. అయినా సరే ప్రజా సమస్యల మీద పోరాడుతూ వాళ్ళ బాగు కోసం కృషి చేస్తున్నాడు. ఇక మొన్న జరిగిన ఎన్నికల్లో పిఠాపురం అసెంబ్లీ నుంచి పోటీ చేసాడు. ఇప్పుడు రిజల్ట్ వచ్చింది.
పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ 70 వేల పై చిలుకు మెజార్టీతో విజయం సాధించారు. ఈ వార్త టీవీ స్క్రీన్లో చూస్తూ పవన్ కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. పవన్ చెల్లెలు విజయ దుర్గ అయితే ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. సోషల్ మీడియా లో ఆ విజువల్స్ వైరల్ గా మారాయి. ఇక పవన్ గెలుపుతో సోదరుడు నాగబాబు, ఇతర కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక పవన్ ఫాన్స్ కి ఆనందానికి అయితే అవధులు లేవు. మా గబ్బర్ సింగ్ అసెంబ్లీ లో అడుగుపెడుతున్నాడు అంటూ నృత్యాలు చేస్తూ బాణాసంచాలు కాలుస్తున్నారు.

![]() |
![]() |