![]() |
![]() |
.webp)
ఒక ఓల్డ్ తెలుగు మూవీలో నట విరాట్ రావు గోపాలరావు డైలాగ్ ఒకటి ఉంటుంది. ఒక్కొక్కలకి ఒక్కో సీజన్ అని. అదే విధంగా ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో త్యాగాల సీజన్ నడుస్తుంది. అగ్ర హీరోల త్యాగాల సీజన్. ప్రస్తుత వాతావరణాన్ని చూస్తుంటే ఆ మాటనే చెప్పుకోవాల్సి వస్తుంది.
దేవర(devara)..ఎన్టీఆర్ (ntr)కెరీర్ లోనే మోస్ట్ ప్రెస్టేజియస్ట్ మూవీగా తెరకెక్కుతుంది.ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటుంది. కొరటాల శివ దర్శకుడు కావడంతో అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి మూవీ అనౌన్సుమెంట్ అప్పుడే ఏప్రిల్ 5 న థియేటర్స్ లో టేక్ ఆఫ్ అవుతామని ప్రకటించారు. కానీ ఎలక్షన్స్ వల్ల కుదరలేదు. దీంతో అక్టోబర్ పది న వస్తామని ప్రకటించారు. ఇప్పుడు ఆ డేట్ కూడా మారబోతుందనే చర్చ ఫిలిం సర్కిల్స్ లో జోరుగా జరుగుతుంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారకంగా ప్రకటించకపోయినా డేట్ చేంజ్ మాత్రం డామ్ ష్యుర్ అంటున్నారు. కాకపోతే అక్టోబర్ పది కంటే ముందే వస్తుందని చెప్తున్నారు. సెప్టెంబర్ 27 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుందనే మాటలు వినిపిస్తున్నాయి. దీని వెనుక ఉన్న కారణాన్ని కూడా చెప్తున్నారు. అక్టోబర్ పది న చరణ్ గేమ్ చేంజర్ (game changer)ని విడుదల చేయాలనీ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్లాన్ చేస్తున్నాడని, దీంతో దేవర ని సెప్టెంబర్ 27 కి విడుదల చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో మేకర్స్ ఉన్నారని అంటున్నారు
ఇంతకు ముందు ఆ డేట్ కి పవన్ (pawan kalyan)ఓజి (og)వస్తుందని అధికారకంగా ప్రకటన కూడా వచ్చింది. కాకపోతే అది కూడా వాయిదా పడింది. డిసెంబర్ లో రావచ్చనే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఎలక్షన్స్ రిజల్ట్ రాగానే ఓజి కాకుండా హరిహర వీరమల్లు ని పవన్ కంప్లీట్ చెయ్యబోతున్నాడు. దీంతో దేవరని ఓజి డేట్ కి రిలీజ్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని తెలుస్తుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న ఈ న్యూస్ ని చూసిన ముగ్గురి అభిమానుల కామెంట్స్ అయితే ఆకర్షణీయంగా మారాయి.రామ్ చరణ్ కోసం ఎన్టీఆర్ త్యాగం చేస్తుంటే ఎన్టీఆర్ కోసం పవన్ త్యాగం చేస్తున్నాడని తమ స్టైల్లో కామెంట్స్ చేస్తున్నారు.ఇక ఎన్టీఆర్ చరణ్ లు బెస్ట్ ఫ్రెండ్స్ అనే విషయం అందరకి తెలిసిందే. ఆ ఇద్దరు కలిసి ఆర్ఆర్ఆర్ లో స్క్రీన్ షేర్ చేసుకొని ఇండియన్ సిల్వర్ స్క్రీన్ దగ్గర సరికొత్త రికార్డులు సృష్టించారు.
![]() |
![]() |