![]() |
![]() |

లాంగ్ లాంగ్ ఎగో బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ ముంబై ఎయిర్ పోర్ట్ లో గన్ ని తీసుకెళ్తు పోలీసులకి చిక్కాడు.దాంతో కటకటాల పాలయ్యి చాలా సంవత్సరాలు శిక్ష అనుభవించాల్సొచ్చింది. ఇప్పటికీ ఆ కేసు తాలూకు నమూనాలు దత్ ని వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా ఒక నటుడు ఇలాంటి కేసు లోనే పోలీసులకి చిక్కాడు. కాకపోతే గన్ లో వాడే బుల్లెట్స్ ని తీసుకెళ్తు దొరికాడు.
కరుణాస్( karunas)తమిళ చిత్ర సీమలో కామెడీ ఆర్టిస్ట్ గా, క్యారక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపుని పొందాడు. డబ్బింగ్ మూవీస్ ఫాలో అయ్యే తెలుగు మూవీ లవర్స్ కి కూడా సుపరిచయస్తుడే. ఆయన నటించిన చాలా చిత్రాలు తెలుగులోకి డబ్ అవడంతో ఆయన కామెడీ ని బాగానే ఎంజాయ్ చేసారు. ఈయన నిన్న సండే రోజున ప్రముఖ ఎయిర్ లైన్ సంస్థకి చెందిన ఇండిగో విమానంలో చెన్నైనుంచి తిరుచ్చి వెళ్తున్నాడు. ఈ సందర్భంగా జరిగిన చెకింగ్ లో ఆయన బ్యాగ్ లో నలభై బులెట్స్(40 bullets) దొరికాయి. దీంతో ఎయిర్ పోర్ట్ అధికారులతో పాటు పోలీసులు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. మొత్తం నలభై బుల్లెట్లను స్వాధీనం చేసుకొని అరెస్ట్ చెయ్యడం జరిగింది. తమిళనాడులో ప్రెజంట్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉన్నందున బుల్లెట్లు కలిగి ఉండటం నేరం.కరుణాస్ మ్యాటర్ ప్రస్తుతం సౌత్ చిత్ర పరిశ్రమలో హీట్ ని రాజేస్తోంది.
2001 లో సూర్య హీరోగా వచ్చిన నంద తో ఆయన సినీ జీవితం ప్రారంభం అయ్యింది. సరికొత్త కామెడీ టైమింగ్ తో స్టార్ స్టేటస్ ని సంపాదించాడు. బాబా, విలన్, తిరుడా తిరుడి, పితామలై, తిరుమలై, ఇంద్రు, వసూల్ రాజా ఎంబిబిఎస్, పొల్లధావన్, వేద, విరుమాన్, రెబల్ ఇలా మొత్తం 120 సినిమాలకి పైనే చేసాడు. తమిళంలో ఉన్న అందరి అగ్ర హీరోల సినిమాల్లోను మెరిశాడు.ప్రస్తుతం తమిళనాడు ఆర్టిస్ట్ అసోసియేషన్ కి వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు. 2016 నుంచి 2021 దాకా తిరువదనై అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి ఎంఎల్ఏ గా పని చేసాడు.
![]() |
![]() |