![]() |
![]() |

టాలీవుడ్ లో మోస్ట్ ప్రామిసింగ్ యంగ్ హీరోలలో ఒకడిగా మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Vishwak Sen) పేరు తెచ్చుకున్నాడు. అందుకు తగ్గట్టే కథలు, పాత్రల ఎంపికలో వైవిధ్యం చూపిస్తూ.. సినిమా సినిమాకి తన రేంజ్ ని పెంచుకుంటున్నాడు. ఇక తన తాజా చిత్రం 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' (Gangs Of Godavari)తో కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ ని రాబట్టాడు.
కృష్ణ చైతన్య దర్శకత్వంలో యాక్షన్ డ్రామాగా రూపొందిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' చిత్రం మే 31న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మార్నింగ్ షో కే డివైడ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. టాక్ తో సంబంధం లేకుండా ఫస్ట్ డే అదిరిపోయే వసూళ్లు రాబట్టింది. విశ్వక్ గత రెండు చిత్రాలను గమనిస్తే.. తెలుగు రాష్ట్రాల్లో మొదటిరోజు 'గామి' రూ.2.96 కోట్ల షేర్, 'దాస్ కా ధమ్కీ' రూ.3.06 కోట్ల షేర్ రాబట్టాయి. అయితే 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' తెలుగునాట మొదటిరోజే రూ.3.51 కోట్ల షేర్ తో సత్తా చాటింది.
ఏరియాల వారీగా చూస్తే.. నైజాంలో రూ.1.10 కోట్ల షేర్, సీడెడ్ లో రూ.76 లక్షల షేర్, ఆంధ్రాలో రూ.1.65 కోట్ల షేర్ రాబట్టిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'.. తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే రూ.3.51 కోట్ల షేర్(రూ.5.80 కోట్ల గ్రాస్) కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా రూ.25 లక్షల షేర్, ఓవర్సీస్ రూ.70 లక్షల షేర్ కలిపి.. ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు రూ.4.46 కోట్ల షేర్(రూ.8 కోట్ల గ్రాస్) సాధించింది.
వరల్డ్ వైడ్ గా రూ.10 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన ఈ మూవీ.. ఫస్ట్ డే 45 శాతం రికవర్ చేసింది. శని, ఆది వారాల్లో కూడా ఇదే జోరు కొనసాగితే.. త్వరలోనే బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశముంది.
![]() |
![]() |