![]() |
![]() |

టాలీవుడ్ కి చెందిన ఎందరో ప్రముఖ నటులు వైజాగ్ లోని సత్యానంద్ ఇన్స్టిట్యూట్ లో యాక్టింగ్ నేర్చుకున్నారు. అయితే త్వరలో హీరోగా పరిచయం కాబోతున్న నందమూరి మోక్షజ్ఞ (Nandamuri Mokshagna) మాత్రం.. అందుకు భిన్నంగా నిత్యానంద దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్నాడట. ఈ విషయాన్ని యువ హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen) చెప్పడం విశేషం.
నందమూరి హీరోలు బాలకృష్ణ (Balakrishna), జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) తో విశ్వక్ సేన్ కి మంచి అనుబంధం ఉంది. విశ్వక్ తాజా చిత్రం 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి బాలకృష్ణ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ ఈవెంట్ తో ఆయన మాట్లాడుతూ.. త్వరలో తన కుమారుడు మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇస్తాడని, అతనికి విశ్వక్ లాంటి యంగ్ హీరోలను స్ఫూర్తిగా తీసుకోమని చెప్పానని అన్నారు. ఇదే విషయాన్ని తాజాగా జరిగిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ప్రెస్ మీట్ లో మీడియా ప్రస్తావించగా.. "నిత్యానంద దగ్గర మోక్షజ్ఞ ట్రైనింగ్" అంటూ విశ్వక్ టంగ్ స్లిప్ అయ్యాడు.
"వైజాగ్ లోని నిత్యానంద దగ్గర మోక్షజ్ఞ ట్రైనింగ్ తీసుకుంటున్నాడని బాలకృష్ణ గారు నాతో చెప్పారు." అని విశ్వక్ అన్నాడు. ఆ మాటకి ఉలిక్కిపడిన మీడియా "ఆయన పేరు నిత్యానంద కాదు.. సత్యానంద్" అని చెప్పారు. దీంతో నాలుక కరుచుకున్న విశ్వక్.. "ఆయన దగ్గర నేను ట్రైనింగ్ తీసుకోలేదు. అందుకే పేరు గుర్తులేదు. సారీ" అన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
![]() |
![]() |